టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) ఇటీవల వైఎస్ఆర్‌సీపీ (YSRCP) రాజీనామా చేశారు. వైసీపీ గూటికి చేరి వారం రోజులు కాకముందే ఆయన ఆ పార్టీని వీడారు. తాజాగా అంబటి రాయుడు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ నెల 20 నుంచి దుబాయ్ వేదిక జరిగే ఇంటర్నేషనల్ లీగ్ టీ-20లో ఎంఐ ఎమిరెట్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నానని వెల్లడించారు.
తన ప్రొఫెషనల్ ఆఠ కొనసాగించేందుకు రాజకీయాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఉందని ట్వీట్ చేశారు. అంబటి రాయుడు గత నెల 28న వైసీపీ గూటికి చేరారు. తాడేపల్లి గూడెం క్యాంపు ఆఫీసులో సీఎం జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. ఈ క్రమంలో వారం రోజులు కాక ముందే వైసీపీకి ఆయన రాజీనామా చేశారు.
వైసీపీ ఇంచార్జుల మార్పుపై ఆయన విమర్శలు గుప్పించారు. ఒక నియోజకవర్గంలోని చెత్త మరో నియోజకవర్గంలో బంగారంగా మారుతుందా అని ఎద్దేవా చేశారు.
గుంటూరు పార్లమెంట్ టికెట్ ఇస్తామని అంబటి రాయుడికి సీఎం జగన్ మాట ఇచ్చారని అన్నారు. కానీ తీరా ఇప్పుడు మాట తప్పారంటూ విమర్శలు చేశారు.
ఎన్నో ఆశలతో అంబటి రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు. జగన్ మాయ మాటలకు మోసపోయి వైసీపీలో చేరారన్నారు. కానీ ఆ తర్వాత జగన్ నైజం అర్ధం చేసుకుని ఆ పార్టీకి గుడ్ బై చెప్పారని వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ క్లీన్ బౌల్డ్ అవుతుందని అంబటి ముందుగానే గమనించారని అన్నారు. అందుకే ఈ విషయాన్ని ముందే ఊహించిన అంబటి ఇప్పుడు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారని పేర్కొన్నారు.