రాష్ట్రంలో బీపీ ఉన్న వారికి హైబీపీ.. హైబీపీ ఉన్న వారికి లో బీపీ వచ్చేలా తెలంగాణ (Telangana) రాజకీయాలు సాగుతున్నాయంటున్నారు. పార్టీలకు జీవన్మరణ సమస్యగా మారిన ఈ ఎన్నికలు కురుక్షేత్రాన్ని తలపిస్తున్నాయి.. ఇక పోలింగ్ స్టేషన్లలో బీఆర్ఎస్ (BRS) నేతల తీరు వివాదాస్పదంగా మారటం కనిపిస్తుంది. ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
మరోవైపు ఎమ్మెల్యే (MLA) సైదిరెడ్డి (Saidireddy) వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. నేనే గెలుస్తా.. అప్పుడు నీ సంగతి చూస్తా.. నీ గొంతు తగ్గించుకొని మాట్లాడు.. లేకపోతే నీ సంగతి చెప్తానంటూ ఎమ్మెల్యే సైదిరెడ్డి ఓ సీఐ (CI)ని బెదిరించినట్టు ప్రచారం జరుగుతుంది. దీంతో సూర్యాపేట (Suryapet) జిల్లా హుజూర్ నగర్ (Huzur Nagar) వీవీ మందిర్ స్కూల్ దగ్గర హై టెన్షన్ నెలకొంది.
తన అనుచరులతో కలసి ఎమ్మెల్యే సైదిరెడ్డి బీఆర్ఎస్ పార్టీ కండువాలతో పోలింగ్ బూత్ కు ఓటు వేయడానికి వచ్చారు. దీంతో కండువా తీయమని డ్యూటీలో ఉన్న సీఐ చెప్పారు. తన డ్యూటీ తాను చేసిన సీఐ పట్ల సైదిరెడ్డి దురుసుగా ప్రవర్తించడం సంచలనంగా మారింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే, సీఐకి మధ్య వాగ్వాదం నెలకొంది. దీంతో అక్కడ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
గణిత శాస్త్రంలో ఉన్న కూడికలు, తీసివేతలు, హెచ్చవేతలు రాజకీయాల్లో కూడా వుంటాయి.. అయితే అవసరాన్ని, అవకాశాన్ని బట్టి అవి మారుతుంటాయి. అలాగని అధికారం చేతిలో ఉందికదా అని ఇలా ప్రవర్తించడం.. దురుసుగా వ్యవహరించడం సరికాదని సైదిరెడ్డి తీరు చూసిన కొందరు అభిప్రాయపడుతున్నారు.. లెక్క మారి బీఆర్ఎస్ అధికారం కోల్పోతే నీ అహంకారం నలుగురిలో నిన్ను నవ్వులపాలు చేస్తుందని అంటున్నారు..