తెలంగాణ (Telangana) బీజేపీ (BJP) లో అయోమయం నెలకొంది.. ఏం జరుగుతుందో ఎవరికీ తెలియడం లేదు.. అభ్యర్థులు లేక జాబితా ప్రకటన ఆలస్యం.. ఇలా అనేక ప్రశ్నలు, అనుమానాల నేపథ్యంలో ఎట్టకేలకు ఫస్ట్ లిస్ట్ ను రిలీజ్ చేసింది కమలం పార్టీ. 52 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసింది. రాష్ట్రంలో ఉన్న నలుగురు బీజేపీ ఎంపీల్లో ముగ్గురు అసెంబ్లీ బరిలో ఉండగా కిషన్ రెడ్డి పేరు మాత్రం ఈ లిస్టులో లేదు.
కిషన్ రెడ్డితోపాటు సీనియర్ నేతలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, విజయశాంతి, డీకే అరుణ పేర్లు కూడా ఇందులో లేవు. అయితే.. తాజా లిస్టులో మహిళలకు పెద్దపీట వేసింది బీజేపీ. ఇటీవల మహిళా బిల్లుకు ఆమోద ముద్ర పడిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఫస్ట్ లిస్టులో 12 మంది మహిళా నేతలకు ఛాన్స్ ఇచ్చింది కమలం పార్టీ.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టంగా మారింది. లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం పొందిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. దీంతో బిల్లు చట్ట రూపం దాల్చింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లును ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ పేరుతో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సెప్టెంబర్ 19న లోక్ సభలో, 21న రాజ్యసభలో ప్రవేశపెట్టారు.
ఫస్ట్ లిస్టులో టికెట్లు దక్కిన బీజేపీ మహిళా నేతలు
బెల్లంపల్లి- అమురాజుల శ్రీదేవి
జుక్కల్ – టీ అరుణ తార
బాల్కొండ – ఏలేటి అన్నపూర్ణమ్మ
జగిత్యాల- భోగా శ్రావణి
రామగుండం- కందుల సంధ్యారాణి
చొప్పదండి- బొడిగె శోభ
సిరిసిల్ల- రాణి రుద్రమ రెడ్డి
చార్మినార్- మేగా రాణి
నాగార్జునసాగర్- కంకనాల నివేదిత రెడ్డి
డోర్నకల్-బుక్య సంగీత
వరంగల్ ఈస్ట్- రావు పద్మ
భూపాలపల్లి- చందుపట్ల కీర్తి రెడ్డి