అసెంబ్లీ ఎన్నికలను ఎన్నో వ్యయప్రయాసాలు పడి దాటిన కాంగ్రెస్ (Congress)కి పార్లమెంట్ ఎలక్షన్స్ పెద్ద సవాల్ గా నిలిచాయి.. పలు హామీలిచ్చి అధికారం చేచిక్కించుకొన్న హస్తం.. ప్రస్తుతం ఆ హామీలల్లో అమలు చేయవలసినవి పెండింగ్ లో ఉండటం వల్ల ఆకలితో ఉన్న పులి నోటికి ఆహారం దొరికినట్లుగా.. బీఆర్ఎస్ (BRS)కు ఈ అంశం అస్త్రంగా మారింది.

ఇదే అంశం పైన బీఆర్ఎస్, బీజేపీ నిలదీయడం కనిపిస్తోంది. అయితే ప్రతి సభలో సీఎం రుణ మాఫీ పైన స్పష్టత ఇస్తున్నారు. ప్రత్యేకంగా కార్పోరేషన్ ను రుణమాఫీ అమలు కోసం ఏర్పాటు చేసి హామీ అమలు చేసేలా కసరత్తు చేస్తున్నామని పేర్కొంటున్నారు.. కానీ రుణమాఫీ కటాఫ్ తేదీ మాత్రం ఖరారు చేయడం లేదు.. అయితే గతంలో రైతుల రుణం రూ. 32 వేల కోట్ల వరకు ఉంటుందని గతంలో రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు.
మరోవైపు రుణమాఫీ కార్పొరేషన్ ఏర్పాటు ద్వారా చేయాలని భావిస్తే, బడ్జెట్‌తో సంబంధం లేకుండానే నిధులు కేటాయించాల్సిఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే బ్యాంకుల రుణాలను కార్పొరేషన్‌కు బదలాయిస్తే ప్రతి నెలా కచ్చితంగా ఆ పైకం బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. అదీగాక ఈ విధానానికి బ్యాంకులు అంగీకరించాలి. ఇందుకోసం సదరు కార్పొరేషన్‌కు రెగ్యులర్‌గా వచ్చే ఆదాయ మార్గాలను చూపించ వలసి ఉంటుంది.
అలాగే ప్రభుత్వం బాండ్స్ రూపంలో గానీ, ఇతర మార్గాల్లో గానీ బ్యాంకులకు ష్యురిటీ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలుపుచున్నారు.. నోటి మాటగా చెప్పిన మాఫీ వెనుక ఇంత స్టోరీ ఉంది. మరి ఇదంతా ఆయన చెప్పిన తేదీకి సాధ్యం అవుతుందా ? అనే అనుమానాలు మొలకెత్తుతున్నాయి.. దీంతో రుణమాఫీ అమలు వ్యవహారం రేవంత్ కు సవాల్ గా మారింది.