తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని ఫలితాలతో బీఆర్ఎస్ (BRS) కాస్త డీలా పడ్డా, లోక్ సభ ఎన్నికల్లో సత్తా చూపించాలని పార్టీ శ్రేణులు పట్టుబట్టినట్టు తెలుస్తోంది. నాయకులు, కార్యకర్తల్లో నూతనోత్సాహం, ఆత్మస్థైర్యం నింపేలా ఇప్పటికే పలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. లోక్ సభ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలతో కేటీఆర్ (KTR) పార్టీ కేడర్ ని ఉత్సాహపరిచే పనిలో ఉన్నట్టు మాట్లాడుకొంటున్నారు..
ఇంతవరకి బాగానే ఉన్న ఓటమిని అంగీకరించే స్థితిలో కేటీఆర్ లేనట్టు ఆయన మాటలు వింటున్న వారు అనుకొంటున్నారు. ఓటమికి కారణాలు విశ్లేషించుకోవడానికీ, వాస్తవాలు అంగీకరించడానికి ఆయన సిద్ధంగా లేరని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఓటమికి ఇతర కారణాలు వెతుకుతోన్నారు తప్పితే.. అసలు నిజాన్ని బయటకి వెల్లడించలేక పోతున్నారనే అపవాదు మూట గట్టుకొంటున్నారు.. బీఆర్ఎస్ అంటే కల్వకుంట్ల ఫ్యామిలీ అనేలా పాలన చేసి ప్రజల్లో చులకన అయిన విషయాన్ని మరచిపోతున్నట్టు విమర్శిస్తున్నారు..
కేసీఆర్ (KCR) ఇచ్చిన మాట తప్పితే మెడ కోసుకొంటారని పలు సందర్భాలలో వెల్లడించిన బిగ్ బాస్.. ప్రజలకు ఇచ్చిన హామీలు ఎన్ని తప్పలేదు.. అలాగైతే ఎన్ని సార్లు మెడకోసుకొంటారని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.. ఇతర పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసే బీఆర్ఎస్ నేతలు.. తమ పాలనపై ఒక్క సారి ఆలోచన చేసుకొంటే.. రాష్ట్ర ప్రజలకు ఎంత దూరంలో ఉన్నారో అర్థం అవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.. నిజాం క్రూర పాలనను మరిపించేలా దొరల పాలన సాగిందనేలా ప్రజల్లో వ్యతిరేకత మొదలైందన్న విషయాన్ని అంగీకరిస్తే.. నాలుక ఇన్ని మాటలు మాట్లాడదని అనుకొంటున్నారు..
దీనికి తోడు.. మిగులులో ఉన్న రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసి.. అవినీతి మచ్చను అంటించుకొన్న బీఆర్ఎస్ తీరు..తెలివి ఉన్న ప్రతి తెలంగాణ బిడ్డను ఆలోచించేలా చేసిందని అనుకొంటున్నారు.. ప్రశ్నిస్తే కేసులు.. బాధలు చెప్పుకొందామని అనుకొంటే.. చిక్కరు దొరకరు.. ఎన్నికల్లో కనిపించే ముఖాలు.. మళ్ళీ ఎలక్షన్స్ వరకు కనిపించవు.. మొత్తానికి రాష్ట్ర ప్రజల స్వేచ్ఛను హరించి కల్వకుంట్ల కుటుంబం మాత్రం స్వేచ్ఛగా దోపిడి చేసిందనే ఆరోపణలు ఉదరగొడుతోన్న ఈ నిజాన్ని ఒప్పుకునే ధైర్యం చిన్న బాస్ చేయకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోందని అనుకొంటున్నారు..
మరోవైపు కాంగ్రెస్ (Congress) ఆరు గ్యారంటీల అమలుకు వంద రోజుల వ్యవధి తీసుకుంటామని ఎన్నికల సమయంలోనే స్పష్టంగా చెప్పింది. ఆ గడువు ముగియకుండానే వాగ్దానాల అమలులో విఫలం అంటూ నిందలు వేస్తే.. తొమ్మిదేళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ అమలు చేయని చాంతాడంత వాగ్దానాల జాబితాను ప్రజలు చదువుతోన్నారు. ఇలా అహంకార పూరితంగా.. నియంతృత్వ ధోరణిలో.. బీఆర్ఎస్ వైఫ్యల్యాల పాలన రాష్ట్ర ప్రజలకు గుణపాఠం నేర్పిందని అనుకొంటున్నారు..