వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు కోసం దావోస్ (Davos) వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బృందం విజయవంతంగా పర్యటనను ముగించుకొంది. రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఇతర అధికారులు మూడు రోజుల్లో 200లకుపైగా ప్రముఖ వ్యాపార సంస్థలు, నాయకులను కలుసుకొన్నట్లు సీఎంవో కార్యాలయం ప్రకటించింది. ఈ పర్యటన వల్ల రాష్ట్రానికి రూ.40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు పెట్టుబడులు వచ్చాయని పేర్కొంది.
అయితే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన వల్ల రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడంతో కేసీఆర్ (KCR), కేటీఆర్ (KTR)లపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కేటీఆర్ పై కేసీఆర్ సీరియస్ అయినట్టు ఉన్న ఒక వీడియో వైరల్ గా మారింది. 7జీ బృందావన కాలనీ సినిమాలో తండ్రి కొడుకును కొడుతున్న వీడియోకి కేసీఆర్, కేటీఆర్, కవిత పేర్లు జత చేశారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇదే అత్యధిక పెట్టుబడులు అని ఉన్న పేపర్ క్లిప్పింగ్ దానిపై ఉంచారు. ఇందులో కేసీఆర్ తలబాదుకుంటూ వెళ్లి కేటీఆర్ ను కొడుతున్నట్లుగా, అది చూసి కవిత ఏడుస్తున్నట్లుగా ఉన్న వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.. ఈ వీడియో చూసిన నెటిజన్స్ రకరకాల కామెంట్స్ పెడుతోన్నారు.
మరోవైపు విదేశీ పర్యటనలకు వెళ్ళి కేటీఆర్ జల్సాలు చేసి వచ్చేటోడు.. రేవంత్ రెడ్డి పెట్టుబడులతో వస్తుండు అని, ప్రస్తుతం కేటీఆర్ ఇంట్లో ఇదే పరిస్థితి కావొచ్చు అని నెటిజన్స్ పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారగా.. బీఆర్ఎస్ అభిమానులకు బాధగా.. కాంగ్రెస్ సానుభూతి పరులకు ఆనందంగా ఉందంటున్నారు..