పార్లమెంట్ ఎన్నికలు రాజకీయ పార్టీల మధ్య పొగపెడుతున్నాయి.. ఇప్పటికే తెలంగాణ (Telangana)లో రేవంత్ వర్సెస్ కేటీఆర్ (KTR) మధ్య వార్ ముదిరి తీవ్రంగా విమర్శించుకొనే స్థాయికి వెళ్ళిన దృశ్యాలు కనిపిస్తున్నాయి.. తాజాగా ఆదిలాబాద్లో బీఆర్ఎస్ కార్యకర్తలతో నిర్వహించిన పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న గులాబి చిన్న బాస్ మరో సారి ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు..
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాజకీయ చదరంగంలో రాటు తేలాడని విమర్శించిన కేటీఆర్.. వంద రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించారని గుర్తు చేశారు.. రైతు రుణమాఫీ డిసెంబర్ 9న చేస్తామని చెప్పి టైమ్ పాస్ చేస్తున్నారని.. ఇప్పుడేమో పంద్రాగస్టులోపు చేస్తామని తెలుపడం.. ఎన్నికల స్టంట్ గా పేర్కొన్నారు.. అలాగే రైతు బంధు గురించి ప్రశ్నిస్తే తమపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు..
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కరువు తెచ్చిందని ఎద్దేవా చేసిన కేటీఆర్.. ఇప్పటికే రాష్ట్రంలో నీళ్ళ కష్టాలు.. కరెంట్ కోతలు మొదలైయ్యాయని విమర్శించారు.. తమ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథతో గూడాలు, తండాలకు నీళ్లు అందించామని గుర్తు చేశారు.. అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (Congress)కి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు..
మరోవైపు రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల తర్వాత భారీ మార్పులు జరుగుతాయని జోస్యం చెప్పిన కేటీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కి షాకివ్వనున్నట్లు పేర్కొన్నారు.. గెలిచిన ఎంపీలతో ఆయన బీజేపీలోకి వెళ్లడం ఖాయమని వెల్లడించారు.. బీఆర్ఎస్ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తే.. కాంగ్రెస్ అధోగతిపాలు చేస్తుందని మండిపడ్డారు..