జీతం అనే పరుగుపందెంలో పరిగెత్తే వాడే గమ్యం చేరుతాడు అంటారు.. అలాగే రాజకీయాల్లో అన్ని విద్యలు తెలిసిన వారే రాణిస్తారని చెబుతారు.. ఈ సూత్రాన్ని ఒంట పట్టించుకున్నారు కాబట్టి కేఆసీఆర్ (KCR) ప్రస్థానం ఇక్కడి దాకా సాగిందని అనుకొంటున్నారు. అయితే పాన్పు అంతా సిద్దం చేసి వచ్చి కూర్చోమంటే అహంకారంతో దూరం చేసుకోవడం ముందు చూపుతో ఆలోచించే వారి లక్షణం కాదని అంటున్నారు. కేటీఆర్ (KTR) ప్రస్తుతం వ్యవహరిస్తున్న తీరును గమనిస్తున్నవారు..
అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) ఓటమి పాలైనా.. అధికారం దూరం అయినా బీఆర్ఎస్ (BRS) నాయకులు అహం మాత్రం వీడటం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.. ప్రజలు, పార్టీ నాయకులు కోరుకునే కలివిడితనం, హుందాతనం మాత్రం ఇంకా దరిదాపులకు రావడం లేదని ముచ్చటించుకొంటున్నట్టు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకుల దందాలు, వర్గ విభేదాల కారణంగా పార్టీ బలహీనంగా మారుతుందని అనుకొంటున్నారు..
ఇదే సమయంలో ఖమ్మం (Khammam) జిల్లాలో ముచ్చటగా మూడోసారి కూడా ఒక్క సీటుకే పరిమితమైన బీఆర్ఎస్ సమిష్టిగా ముందుకు పోయేందుకు ఏ మాత్రం ప్రయత్నాలు చేయడం లేదనే విమర్శలు ఎదుర్కొంటుంది.. నేడు హైదరాబాద్ (Hyderabad)లో జరిగే పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) సన్నాహక సమావేశానికి ఉమ్మడి జిల్లా నుంచి అనేక మంది నాయకులకు ఆహ్వానం అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేతలు.. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మారదంటూ పెదవి విరుస్తున్నారు.
మరోవైపు మాజీ మంత్రి పువ్వాడ చెప్పినట్లుగానే అధిష్టానం వ్యవహరిస్తుందనే ఆరోపణలు వస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం ఖమ్మం కార్పొరేటర్లు, పలువురు నాయకులతో అజయ్ సమావేశం ఏర్పాటు చేసి స్థానిక నాయకులకు మాత్రమే సమాచారం అందించారని, తమకు ఎలాంటి సమాచారం లేదని వాపోయినట్టు సమాచారం.. అయితే ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎవరు బరిలో నిలుస్తారన్నది జిల్లాలో హాట్ టాపిగ్గా మారింది.
అనుచరులు మాత్రం నామ బరిలో ఉంటారని అంటున్నారు. మాజీ మంత్రి పువ్వాడ పేరు సైతం వినిపిస్తుంది. వీరిద్దరి పేర్లతో పాటు మరో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పేరు కూడా తెరపైకి వస్తుంది. ఇక ప్రస్తుతం విదేశాల్లో ఉన్న ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు తాత మధుసూదన్. అయితే ఈ నెల 18న వస్తానని.. అప్పటి వరకు సమావేశాన్ని వాయిదా వేయాలని రిక్వెస్ట్ చేసినా.. బీఆర్ఎస్ అధినాయకత్వం పట్టించుకోకపోవడం గమనార్హం.
ఉమ్మడి జిల్లాలో పార్టీ ఓటమి చెందిన.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన నియోజకవర్గం భద్రాచలం ఒక్కటే. దానికి నియోజకవర్గ ఇన్ ఛార్జిగా ఉన్న తాత మధు.. అక్కడ అభ్యర్థిని గెలిపించుకొన్నారు. ప్రస్తుతం ఆయన లేకుండానే ఈ మీటింగ్ జరగడం విమర్శలకు తావిస్తుంది..