Telugu News » Telangana TDP: తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం..?

Telangana TDP: తెలంగాణలో పోటీకి టీడీపీ దూరం..?

పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) అరెస్టు, వైసీపీ సర్కారుపై పూర్తి స్థాయిలో పోరాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని భావిస్తున్నట్లు సమాచారం.

by Mano
Telangana TDP: TDP away from competition in Telangana..?

తెలంగాణ తెలుగుదేశం పార్టీ(TTDP) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రానున్న అసెంబ్లీలో పోటీకి దూరంగా ఉండనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్కిల్‌ డెవల్‌పమెంట్‌ కేసు(Skill Development Case)లో పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు(Chandrababu) అరెస్టు, వైసీపీ సర్కారుపై పూర్తి స్థాయిలో పోరాడుతున్న నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించలేమని భావిస్తున్నట్లు సమాచారం.

Telangana TDP: TDP away from competition in Telangana..?

తెలంగాణలో నామమాత్రంగా పోటీచేసేకంటే పూర్తిగా దూరంగా ఉండటమే మంచిదని పార్టీ అగ్రనేతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. టీడీపీ-టీఎస్‌ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ శనివారం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో చంద్రబాబుతో ములాఖత్‌లో అయ్యారు. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్‌కు పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.

తెలంగాణ ఎన్నికల బరిలో నిలవడానికి అనుమతివ్వాలని కాసాని కోరగా అందుకు చంద్రబాబు స్పందిస్తూ.. ‘ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం తెలంగాణపై ఫోకస్‌ పెట్టలేం. దిగితే పూర్తి స్థాయిలో యుద్ధం చేయాలి. కానీ ఇప్పుడు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో మీరంతా చూస్తున్నారు. వచ్చే ఏడాది మే నెలలో ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలు జరగబోతున్నాయి. పూర్తి శక్తియుక్తులు కేటాయించి ఇక్కడ ఎన్నికల్లో పోరాడి ఫలితం సాధించాలి.’ అని చెప్పారట.

అదేవిధంగా ‘ఏపీలో మనం విజయం సాధిస్తే తర్వాత తెలంగాణలో కూడా పార్టీకి తేలిగ్గా బలం పుంజుకుంటుంది. ఆషామాషీగా పోటీ చేసి సరైన ఫలితం రాలేదని బాధపడే బదులు దూరంగా ఉండటమే మంచిది. నేను చెప్పిన విషయాలపై మీరు కూడా ఆలోచన చేయండి. అవసరమైతే మనం మరోసారి చర్చిద్దాం’ అని కాసానికి చంద్రబాబు సర్దిచెప్పినట్లు సమాచారం.

You may also like

Leave a Comment