తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం భారత రాజ్యాంగం(INDIAN CONSTITUTION) మార్పు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బహుజన సమాజ్ వాదీ పార్టీ (BSP) స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen kumar) ఆ పార్టీకి రాజీనామా చేసి భారత రాష్ట్ర సమితి(BRS)లో మాజీ సీఎం కేసీఆర్(KCR) సమక్షంలో చేరిన విషయం తెలిసిందే. అయితే, లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్, ఆర్ఎస్పీని టార్గెట్ చేసింది.
గతంలో బీఎస్పీ చీఫ్‌గా ఉన్న సమయంలో అధికార బీఆర్ఎస్ పార్టీపై ఆర్ఎస్పీ చేసిన కామెంట్స్‌తో పాటు గతంలో ఓ ప్రెస్మీట్లో అప్పటి సీఎం కేసీఆర్ రాజ్యాంగం మార్పుపై చేసిన వ్యాఖ్యలను యాడ్ చేసి ఓ వీడియో క్లిప్పింగ్ తయారుచేసింది. దీనికి పలు సినిమాల్లోని ఫన్నీ క్లిప్పింగ్స్ సైతం జతపర్చింది. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని పలుమార్లు విమర్శించిన ఆర్ఎస్పీ..దళితుల ఓట్లను కమలం పార్టీకి దూరం చేశారు.
అదే విధంగా దొరను దించుతా.. దించుతా అని.. దొర పంచనే చేరావు కదా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని బీజేపీ ఎక్స్(ట్విట్టర్) ద్వారా ప్రశ్నించింది. అందులో ఓ వీడియోను కూడా జతపరిచింది.‘ఇండియాకు కొత్త రాజ్యాంగం అవసరం… రాజ్యాంగాన్ని తిరిగి రాయాల్సిన అవసరం ఉందని’ కేసీఆర్ కామెంట్స్ అందులో ఉన్నాయి.
https://x.com/BJP4Telangana/status/1771833496094294121?s=20
ఇంతటితో కథ అయిపోలేదని.. తర్వాయి భాగం కూడా ఉందని.. కథలో ట్విస్ట్ అదే సామి అని గుడుంబా శంకర్ లో పవన్ చెప్పిన డైలాగ్ రాగానే బీఎస్పీ మాజీ చీఫ్ గులాబీబాస్ చేత కండువా కప్పుకుని బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు చెప్పండి రాజ్యాంగం ఎవరు మారుస్తా అన్నారు? మీరు ఎవరి పంచన చేరారు? అని స్టేట్ బీజేపీ సోషల్ మీడియా వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ పై సెటైరికల్ ట్వీట్ చేసింది. ఇదిలాఉండగా కేవలం ఒక్క బీజేపీనే కాకుండా కాంగ్రెస్ ఇతర పార్టీలు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాయి.