ప్రపంచ దేశాల్లో భారతీయులు (Indians) పలు రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ప్రపంచ దిగ్గజ సంస్థలైన మెక్రో సాఫ్ట్ (Microsoft), గూగుల్ (Google) సహా పలు సంస్థల్లో భారతీయులు అత్యంత ఉన్నత పదవులను అలంకరించారు. అటు రాజకీయాల్లోనూ సత్తా చాటుతూ పలు దేశాల్లో ఉన్నత పదవుల్లో కొనసాగుతూ పాలనా పరంగా కూడా తమదైన ముద్ర వేస్తున్నారు.
ఆసియా, యూరప్, ఆఫ్రికా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు ఇలా ఒక్కటేమిటి.. ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో భారతీయులు సెటిల్ అయ్యారు. మనోళ్ల ప్రతిభను గుర్తించిన చాలా దేశాలు ఇక్కడి విద్యార్థులకు వీసాల విషయంలో నిబంధనలను సులభతరం కూడా చేశాయి. భారతీయులు కూడా మెరుగైన ఉపాధి అవకాశాలు ఉండటం, మంచి సౌకర్యాలు అందుతుండటంతో చాలామంది విదేశాల బాట పడుతున్నారు.
ఇప్పటికే కోట్లాది మంది భారతీయులు పలు దేశాల్లో గ్రీన్ కార్డులు పొంది అక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకుని ఉంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో భారతీయులు లేని దేశం లేదని అంటూ ఉంటారు. కానీ, భారతీయులు లేని దేశాలు కూడా కొన్ని ఉన్నాయని చాలా మందికి తెలియదు. ప్రపంచంలో అత్యంత చిన్న నగరమైన వాటికన్ సిటీలో అసలు భారతీయులు లేరనే విషయం చాలా మందికి తెలిసి ఉండదు.
ఇక ఇటలీ సరిహద్దు దేశమైన శాన్ మారినోలోనూ మనోళ్లు లేరు. ఇక్కడ సరైన మౌలిక సౌకర్యాలు సరిగ్గా లేకపోవడంతో ఈ దేశానికి భారతీయులు వెళ్లడం లేదు. చిన్న దేశం తువాలులో వైద్య సౌకర్యాలు, జనాభా కూడా తక్కువగా ఉంటుంది. దీంతో అక్కడికి వెళ్లేందుకు అయిష్టత చూపుతున్నారు. పాకిస్తాన్, బల్గేరియాలో కూడా ఒక్క భారతీయుడు కూడా లేడు.