ఇటీవల బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి (Kadiam Srihari) బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్(KCR) పై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు బీఆర్ఎస్(BRS) పార్టీలో తగిన గుర్తింపు దక్కలేదని అన్నారు.
పార్టీలో పనిచేసే వారందరినీ కూడా ఏదో ఒక కంపెనీలో కార్మికులుగా చూశారే తప్పా.. అందరికీ తాము బీఆర్ఎస్లో భాగస్వాములం అనే ఫీలింగ్ ఎన్నడూ కలుగ లేదన్నారు.
తమకు పార్టీలో ఓనర్ షిప్ రాలేదని, యాజమాన్యం దక్కని పార్టీలో మనసు పెట్టి పనిచేయడం కష్టమవుతుందన్నారు. కేసీఆర్ కూడా మీకేం తెలుసు అన్నట్లుగా ప్రవర్తించేవారని.. తమ అభిప్రాయాలను లైట్ తీసుకునే వారని కడియం ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదిలాఉండగా, కడియం శ్రీహరి బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఆ పార్టీ నేతలు ఆయనపై మాటల దాడికి దిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. గతంలో బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కడియం కావ్యా.. సరిగ్గా ఎన్నికల ముందు బీఆర్ఎస్ టికెట్ కాదని ఆ పార్టీకి రాజీమానా చేశారు.
అనంతరం తండ్రితో సహా కాంగ్రెస్ పార్టీలో చేరి అదే వరంగల్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. కాగా, వరంగల్ పార్లమెంట్ స్థానంలో కావ్యను ఓడిస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సవాల్ విసిరారు.