తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఎవరు ఊహించని విధంగా రిజల్ట్ వచ్చింది ముఖ్యమంత్రి కేసీఆర్ పదేళ్లపాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితిని ఓడిస్తూ ఓటర్లు తీర్పునిచ్చారు. ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు ప్రజలు. ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ తో పాటుగా మరికొందరు మంత్రులు కూడా ప్రమాణం చేయబోతున్నారు. ఇక దృష్టి అంతా ఏపీ రాజకీయాలపై పడింది. ఇంకో నాలుగు నెలల్లో లోక్ సభ తో పాటు అసెంబ్లీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో జరగబోతున్నాయి.
ప్రస్తుత ముఖ్యమంత్రి వై యస్ జగన్మోహన్ రెడ్డి సారధ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 2019 ఎన్నికల్లో 151 స్థానాలతో తిరుగులేని విజయాన్ని వైఎస్ఆర్సిపి అందుకుంది. ఈసారి 175 కి 175 స్థానాలని గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇక ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ వస్తుంది అని చర్చ మొదలైంది.
Also read:
తెలుగుదేశం జనసేన పెట్టుకున్న పొత్తు ప్రస్తుత పరిస్థితుల్లో 2019 నాటి ప్రపంచాన్ని వైఎస్ఆర్సిపి మళ్ళీ సృష్టిస్తుందా అనేది ఆసక్తికరంగా మారిపోయింది అయితే దీని మీద ఒక సంస్థ సర్వే నిర్వహించింది. ఏ పార్టీలోకి అధికారంలోకి రాబోతోంది అనేది సర్వ్ చెప్పింది ఈ సర్వే ప్రకారం వైఎస్ఆర్సిపి మొత్తంగా 113 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సిపి బలంగా ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే 113 స్థానాల్లో వైఎస్ఆర్సిపి ని ప్రజలు గెలిపిస్తారని సర్వే చెప్తోంది.