పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) కు సంబంధించి రాష్ట్రంలో దూకుడు పెంచగా.. ఇక్కడ డబుల్ డిజిట్ స్థానాలను పొందడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ (BJP) అధిష్టానం అందుకు తగినట్టుగా పావులు కదుపుతోంది. తెలంగాణ(Telangana)లో నాలుగో విడతలో పార్లమెంట్ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈలోపు ప్రధాని మోడీ (PM MODI) మరోసారి తెలంగాణలో పర్యటించి బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. ఆయనతో పాటు మరికొంత మంది కేంద్రమంత్రులు కూడా ప్రచారానికి రానున్నట్లు సమాచారం.
తాజాగా తెలంగాణ మాజీ గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ (Ex Governor Tamil sye sounder Rajan) సోమవారం హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. తమిళనాడులో ఎంపీ ఎన్నికలు పూర్తైన సందర్భంగా కేంద్రంలోని బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు ఆమె తెలంగాణలో మళ్లీ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె రాష్ట్ర ప్రజలను, ఎంపీ ఎన్నికలను ఉద్దేశించి మీడియాతో సమావేశంలో మాట్లాడారు.
‘తెలంగాణ రాష్ట్రంలో ప్రచారానికి రావడం, ప్రజలని కలవడం అదృష్టంగా భావిస్తున్నా.. ఇందుకు అవకాశం కల్పించిన అధిష్టానానికి ధన్యవాదాలు. ఎన్నికల ప్రచారంలో వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో ప్రచారం చేస్తాను. ఎక్కడ చేయమంటే అక్కడ చేస్తాను.
ఈసారి తెలంగాణలో మెజార్టీ ఎంపీ స్థానాలను గెలుస్తున్నాం. ఫలితాలు వెలువడిన తర్వాత ఇక్కడ నుంచి ఎక్కువ మంది కేంద్ర మంత్రులుగా ఉంటారు.సౌత్ చెన్నైలో హోరాహోరీ పోటీ ఉంది. కానీ గెలిచి తిరతాను. రిజర్వేషన్ అంశం తీసివేసే ప్రసక్తే లేదు. దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ క్లారిటీ ఇచ్చారు.అయినప్పటికీ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయి.
రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి ఎమర్జెన్సీ విధించింది ఎవరు? ఆ సమయంలో నేను కూడా బాధితురాలినే. ఎమర్జెన్సీ సమయంలో నా తండ్రిని అరెస్ట్ చేశారు. అప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డాము.అలాంటి కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు’ అని తమిళి సై సౌందర్ రాజన్ వ్యాఖ్యానించారు.