కలియుగ దైవం అయిన ఆ వెంకటేశ్వరున్ని దర్శించుకోవాలని ఆశిస్తున్న కొందరి భక్తులకు ఏదో ఒక రూపంలో ఆటంకాలు ఎదురవుతుండటం కనిపిస్తోంది. కరోనా తర్వాత నుంచి కాలినడక వెళ్లాలంటే అడవి జంతువులతో ప్రాణభయం ఎదురవుతోన్న దృశ్యాలు చోటు చేసుకొంటున్నాయి.. ఇక రోడ్డు మీద ప్రయాణించే వాహనాలు ఆడపాడదపా ప్రమాదాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

ఈ ప్రమాదంలో 50 ఏళ్ల వయస్సున్న మహిళకు తీవ్ర గాయాలు కాగా, మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడినట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని తిరుపతిలోని బర్డ్ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం.. మరోవైపు రక్షక దళాలు ప్రమాదానికి గురైన జీపును అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా వ్యవహరించారు.. కాగా ఈ ప్రమాదం జరగడంపై విచారణ చేపట్టారు..