Featured posts
– సాహితీ స్కాం కేసులో కొత్త వివాదం
– ఆధారాలు లేకుండా మరో కేసులో పూర్ణచంద్రరావుని ఇరికించే ప్రయత్నం జరిగిందా?
– డబ్బులు కంపెనీ తీసుకోవడం ఏంటి? కేసు పూర్ణచంద్రరావుపై పెట్టడం ఏంటి?
– కథంతా నడిపించిన ఏసీపీ ఉమామహేశ్వర్ రావు
– ఎఫ్ఐఆర్ లో సాహితీ కంపెనీని నిందితునిగా ఎందుకు చేర్చలేదు?
– పెద్ద మొత్తంలో నగదు కంపెనీకే చేరినా..
– పూర్ణచంద్రరావును, ఆయన కుటుంబాన్ని మానసికంగా వేధించేందుకే ఏ1గా చేర్చారా?
– అసలు, ఎఫ్ఐఆర్ నమోదుకు ఆలస్యం ఎందుకు?
– సంతకాలు చేసి డబ్బులు తీసుకున్న వాళ్లను నిందితులుగా ఎందుకు పేర్కొనలేదు?
ACP Umamaheswar Rao : అక్రమాస్తుల కేసులో అడ్డంగా దొరికిపోయాడు సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వర్ రావు. బీఆర్ఎస్ హయాంలో బడా కేసుల్ని పట్టి భారీగా ముడుపులు అందుకున్నట్టు ఇతనిపై ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ సహా 14 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు జరిపారు. ఈ సోదాల్లో భారీగా డబ్బు, బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్ లో ఉమామహేశ్వర్ రావు ఆస్తుల విలువ 50 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే, ఇంత మొత్తంలో ఉమామహేశ్వర్ రావు కూడబెట్టాడంటే ఎన్ని కేసుల్లో అవినీతికి పాల్పడ్డాడో అనే చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో సాహితీ స్కాం వ్యవహారంలో కొత్త కేసు నమోదవ్వడం, అందులో ఎలాంటి ఆధారాలు లేకుండానే పూర్ణచంద్రరావును ఏ1గా చేర్చడం చూస్తుంటే ఉద్దేశపూర్వకంగా ఇది జరిగిందనే టాక్ వినిపిస్తోంది.
సాహితీ స్కాం కేసులో కీలకం.. భారీగా ముడుపులు
సీసీఎస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ టీమ్3 ఏసీపీగా పని చేస్తున్నాడు ఉమామహేశ్వర్ రావు. ప్రీ లాంచ్ పేరుతో వందల మందిని ముంచేసిన బూదాటి లక్ష్మి నారాయణ కేసు (సాహితీ స్కాం) ను ఈయనే దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులోనే ఆయన భారీగా ముడుపులు అందుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. అటు డైరెక్టర్ల నుంచి, ఇటు బాధితుల్ని బెదిరించి డబ్బులు గుంజినట్టుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈయన ఎక్కడ పనిచేస్తే అక్కడ అమ్యామ్యాలు షరా మామూలే అని పోలీస్ వర్గాల్లో మాట్లాడుకుంటున్నారు.
పూర్ణచంద్రరావును ఇరికించారా?
సాహితీ వ్యవహారంలో దర్యాప్తు సరిగ్గా జరగడం లేదని ముందు నుంచి ఆరోపణలు ఉన్నాయి. కోట్ల రూపాయలు ఇంట్రస్ట్ తీసుకున్న వారిపై చర్యలు తీసుకున్నది లేదు. దాదాపు 13 వందల కోట్ల రూపాయల బ్యాంకు స్టేట్ మెంట్లలో ఎన్నో లింకులు ఉన్నా వాటిపై దృష్టి సారించలేదు. ల్యాండ్ అడ్వాన్సుల రూపంలో వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడు లక్ష్మీ నారాయణ. సొంతానికి చాలా వాడేసుకున్నాడు. కానీ, పోలీసులు ఆ దిశగా దర్యాప్తును ముందుకు సాగించలేదనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి కారణం కేసును పక్కదోవ పట్టించడానికి బూదాటి మార్కెటింగ్ వాళ్లను బూచిగా చూపించడమే. పూర్ణచంద్రరావు లాంటి వాళ్లపై అంతా తోసేసి తనకున్న పలుకుబడితో, ఉమామహేశ్వర్ రావును వాడుకుని కథంతా నడిపించాడనే టాక్ ఉంది. ఇది చాలదన్నట్టు, ఉమామహేశ్వర్ రావు ఉద్దేశపూర్వకంగా పూర్ణచంద్రరావును మరో కేసులో ఇరికించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 15న అంటే, ఉమామహేశ్వర్ రావు ఇంట్లో ఏసీబీ సోదాలకు కొద్ది రోజులకు ముందు సాహితీ సంస్థ తన తండ్రిని మోసం చేసిందని ఓ వ్యక్తి ఫిర్యాదు చేయగా, కేసు రిజిస్టర్ అయింది. విచిత్రం ఏంటంటే, ఇందులో పూర్ణచంద్రరావును ఏ1గా పెట్టారు. కంపెనీ బూదాటి లక్ష్మినారాయణది. లాభనష్టాలన్నీ అతనిదే బాధ్యత. అలాంటప్పుడు బూదాటిని ఏ1గా పెట్టాలి కానీ, పూర్ణచంద్రరావు పేరును మెన్షన్ చేయడం ఏంటనే ప్రశ్న ఉప్పన్నమౌతోంది. ఇదంతా చూస్తుంటే ఉమామహేశ్వర్ రావు కావాలని కక్ష గట్టి కేసులో పూర్ణచంద్రరావును ఇరికించినట్టుగా అర్థం అవుతోందనే చర్చ జరుగుతోంది. బాధితుడు కోటి 30 లక్షల 13వేలు కంపెనీకి ఇచ్చినట్టు రిసిప్ట్స్ ఉన్నాయి. కానీ, వాటిలో ఎక్కడా పూర్ణచంద్రరావుకి ఇచ్చినట్టు లేదు. అలాంటప్పుడు ఆయన ఏ1 ఎందుకు అయ్యారనే అనుమానం సర్వత్రా వినిపిస్తోంది.
డైవర్షన్ కింగ్ ఉమామహేశ్వర్ రావు
సాహితీ కేసుని అడ్డం పెట్టుకుని ఇబ్రహీంపట్నంలో తనపై వచ్చిన ఫిర్యాదులను ఉమామహేశ్వర్ రావు మ్యానేజ్ చేసేవాడని బాధితులు అంటున్నారు. పూర్ణచంద్రరావుపై పెట్టిన కేసులో నానక్ రామ్ గూడ ప్రాజెక్ట్ కు సంబంధించి కస్టమర్ దగ్గర డబ్బులు తీసుకుంది రాకేష్, అతని సోదరి. దానికి సంబంధించిన పత్రాలపై సంతకాల చేసింది రాకేషే. వాటిపై తాటికాయంత అక్షరాలతో సాహితీ సంస్థ పేరు కూడా ఉంది. ఎక్కడా పూర్ణచంద్రరావు పేరు లేదు. అయితే, ఈ కేసుని ఏసీపీ ఉమామహేశ్వర్ రావు తన పక్కా కమర్షియల్ బ్రెయిన్ తో డైవర్ట్ చేసి డబ్బులు పూర్ణచంద్రరావుకి ఇచ్చినట్లు కస్టమర్స్ కి రాంగ్ డైరెక్షన్ చేసి కేసు బనాయించాడని అంటున్నారు. అంతేకాదు, పూర్ణచంద్రరావు ఫ్యామిలీని కూడా యాడ్ చేసి డబ్బులు డిమాండ్ చేయడానికి ప్లాన్ చేశాడని అనుమానిస్తున్నారు. నిజానికి కస్టమర్ కంపెనీ నుంచి సంవత్సరం కంటే ఎక్కువ అద్దె తీసుకున్నాడని సంబంధిత పత్రాల ద్వారా తెలుస్తోంది. అలాగే, కస్టమర్స్ కు అగ్రిమెంట్ కాపీలను కొరియర్ లో పంపారు. అయినా కూడా పూర్ణచంద్రరావును ఇరికించాలన్న ఒకే ఒక్క లక్ష్యంతో ఈ కేసు నమోదు చేసినట్టుగా అనిపిస్తోంది. అందుకే, ఆయన్ను ఏ1గా చేర్చారని, అసలు, డబ్బులు తీసుకున్న వారు, కంపెనీకి ఏ సంబంధం లేదన్నట్టుగా వ్యవహారం నడిపించే ప్రయత్నం చేశారని అంటున్నారు. నిజానికి, ఏ కేసునైనా తిమ్మిని బమ్మిని చేయడంలో మాస్టర్ మైండ్ ఖిలాడీ ఉమా మహేశ్వర్ రావు. చివరికి మీడియాకి కూడా తప్పుడు సమాచారం లీక్ చేసి బెదిరించడంలో సిద్ధహస్తుడని ప్రచారం జరుగుతోంది.
తప్పుడు కేసులు పెట్టడంలో దిట్ట
ఉమామహేశ్వర్ రావు మామూలు పోలీస్ కాదు. ఇతనిపై అనేక ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నాయి. ఇబ్రహీంపట్నం డబుల్ మర్డర్ కేసులో కోట్లలో మామూళ్లు తీసుకున్నట్టు ఆరోపణలున్నాయి. కొందరు అధికారుల కోసం, డబ్బు కోసం చాలామందిని వేధించినట్టు బాధితులు చెబుతున్నారు. డీసీపీ ప్రభాకర్ రావు ఆదేశాలతో శ్రవణ్ చౌదరిని సీసీఎస్ కు పిలిచి చిత్ర హింతలకు గురి చేశాడని, యూఎస్ రిటర్న్ కందుల మహేష్ పై దాడికి ప్రయత్నించాడని విమర్శలొచ్చాయి. ఈయన ఫిర్యాదు కూడా ఏసీబీ తనిఖీలకు ఓ కారణం. అంతేకాదు, 16 వందల కోట్ల ఎఫ్ఎంసీజీ కంపెనీకి సంబంధించిన ఇష్యూలో పెనుమత్స కృష్ణంరాజు దగ్గర 3 కోట్లు తీసుకుని కేసుని డైవర్ట్ చేశాడని అప్పట్లో తెగ మాట్లాడుకున్నారు. అలాగే, శ్రీనివాస్ నాయక్ అనే వ్యక్తి నుంచి ల్యాండ్ గొడవలో డబ్బులు తీసుకున్నట్టు ఏసీబీకి ఫిర్యాదు అందింది. తాజాగా ఏసీబీ రెయిడ్ జరగడానికి ఇదే ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇవే కాకుండా ఇబ్రహీంపట్నంలో వచ్చిన ప్రతీ కేసులోనూ సెటిల్ మెంట్ వ్యవహారాలు నడిపాడు. తప్పుడు కేసులు పెట్టి డబ్బులు డిమాండ్ చేయడంలో ఉమామహేశ్వర్ రావును మించినవారు లేరని పోలీస్ సర్కిల్స్ లో తెగ మాట్లాడుకుంటున్నారు. సీనియర్ ఆఫీసర్స్ ను మభ్యపెట్టి కేసుని తలకిందులు చేయడంలోనూ ఇతను నెంబర్ వన్. తనకి వ్యతిరేకంగా ఎవరైనా సీనియర్ ఆఫీసర్స్ కి ఫిర్యాదు చేసినా, కోర్టుకు వెళ్లినా 41 నోటీసులు ఇచ్చి స్టేషన్ చుట్టూ తిప్పుకుంటూ పైశాచిక ఆనందం పొందేవాడని చెబుతున్నారు.
ఉమామహేశ్వర్ రావు ఆస్తుల వివరాలు
ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరుకి చెందిన ఉమామహేశ్వర్ రావు 1995 బ్యాచ్ ఎస్ఐ. సిటీ కమిషనరేట్ పరిధిలో చాలా కాలం పని చేశాడు. ఇబ్రహీంపట్నం ఏసీపీగా ఉన్నప్పుడు సివిల్ విదాల్లో తలదూర్చాడు. బాధితుల ఫిర్యాదుతో సస్పెండ్ కూడా అయ్యాడు. అధికారుల లెక్కల ప్రకారం,
శామీర్ పేటలో రూ.80 లక్షల విలువైన ఎకరం భూమి
333 గజాల విల్లా
జవహర్ నగర్ లో 3 గుంటల భూమి
ఘట్ కేసర్ లో 4 ప్లాట్లు
శామీర్ పేట్ లో 14 గుంటల బినామీ భూమి
అశోక్ నగర్ లో 3 అపార్ట్ మెంట్ ఫ్లాట్స్
కూకట్ పల్లిలో 200 గజాల ప్లాట్
విశాఖలో 25 సెంట్ల భూమి
చోడవరంలో 5.92 ఎకరాలు, 240 గజాల ప్లాట్
దొండపూడిలో 2.20 ఎకరాల బినామీ భూమి
ఆర్ఎస్ కన్ స్ట్రక్షన్ లో విల్లా కోసం రూ.50 లక్షల పెట్టుబడి
సోదాల్లో రూ.38 లక్షల నగదు, 60 తులాల బంగారం స్వాధీనం