తెలంగాణ (Telangana) సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి (Yadadri) లక్ష్మీ నరసింహ స్వామి ((Lakshmi Narasimha Swamy) ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పిల్లలకు పరీక్షలు ముగియడం.. సెలవులు రావడం.. అందులో ఆదివారం హాలిడే కావడంతో దర్శనానికి భక్తులు పోటెత్తారు.. రాష్ట్రం నలుమూల నుంచి తండోపతండాలుగా తరలివచ్చారు. తెల్లవారు జామునుంచే క్యూలైన్లో భక్తులు బారులు తీరారు.
ఆలయ ప్రాంగణంలోని పరిసర ప్రాంతాల్లో లడ్డు కౌంటర్లు, కల్యాణ కట్ట ప్రదేశాలన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి.. ఈ నేపథ్యంలో స్వామి వారి ఉచిత దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతోందని సమాచారం.. అలాగే ప్రత్యేక దర్శనం కోసం సైతం సుమారు 2 గంటల సమయం పడుతోందని తెలుస్తోంది.. పైన ఎండలు మండిపోతున్న ఎక్కడ జనం తగ్గడం లేదంటున్నారు..
ఈ క్రమంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఎవరికీ ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. ఇక చిన్న పెద్ద అనే తేడా లేకుండా భక్తులు ఓపికతో లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవడం కనిపిస్తోంది. కాగా ఆలయ పరిసరాలల్లో ఎటుచూసినా భక్తులే కనిపిస్తున్నారు.