Telugu News » Traffic Advisory : అలర్ట్… ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు…!

Traffic Advisory : అలర్ట్… ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు…!

ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ నాయకులతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

by Ramu
traffic advisory issued for swearing in of telangana cm at lb stadium

తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి (Revanth Reddy) రేపు ప్రమాణం చేయనున్నారు. ఎల్బీ స్టేడియం (LB Stadium)లో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయ నాయకులతో పాటు పలువురు ప్రముఖులు హాజరు కానున్నారు.

traffic advisory issued for swearing in of telangana cm at lb stadium

ఈ నేపథ్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని పోలీసు అధికారులు తెలిపారు. ఏపీలో పెట్రోల్ పంపు వైపు నుంచి వస్తున్న ట్రాఫిక్‌ను బీజేఆర్ విగ్రహం వైపు నిలిపి వేయనున్నారు.

ట్రాఫిక్‌ను నాంపల్లి, చాపెల్ రోడ్ వైపు దారి మళ్లించనున్నారు. బషీర్బాగ్ నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వచ్చే ట్రాఫిక్‌ను కింగ్కోఠి , ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ రోడ్డు వైపు మళ్లిస్తారు. ఎస్బీఐ గన్ ఫౌండ్రి నుంచి వచ్చే ట్రాఫిక్ను బీజేఆర్ సర్కిల్ వైపు కాకుండా చాపల్ రోడ్ వైపు వెళ్లాల్సి ఉంటుంది.

రవీంద్ర భారతి నుంచి బీజేఆర్ విగ్రహం వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులను ఎల్బీ స్టేడియం మెయిన్ గేట్ నుంచి ఏఆర్ పెట్రోల్ (పబ్లిక్ గార్డెన్) బంక్ వద్ద నాంపల్లి స్టేషన్ రోడ్ వైపు మళ్లించనున్నారు. ఇక సుజాత స్కూల్ లైన్ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ భవనం వైపు వచ్చే ట్రాఫిక్ను సుజాత స్కూల్ జంక్షన్ వద్ద నాంపల్లి స్టేషన్ రోడ్డు వైపు మళ్లిస్తారు.

You may also like

Leave a Comment