Telugu News » Tripti Dimri: ‘యానిమల్’ బ్యూటీ కోసం క్యూ కట్టిన నిర్మాతలు.. టాలీవుడ్ హీరోతో సినిమా..!

Tripti Dimri: ‘యానిమల్’ బ్యూటీ కోసం క్యూ కట్టిన నిర్మాతలు.. టాలీవుడ్ హీరోతో సినిమా..!

రష్మిక తర్వాత సెకండ్ హీరోయిన్‌గా నటించిన తృప్తి డిమ్రి(Tripti Dimri).. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిగ్‌గా మారింది.

by Mano
Tripti Dimri: Producers lined up for 'Animal' beauty.. Movie with Tollywood hero..!

అర్జున్‌రెడ్డి డైరెక్టర్ సందీప్ వంగ(Sandeep Vanga) తెరకెక్కించిన తాజా సినిమా ‘యానిమల్’(Animal). ఈ సినిమా ఇటీవల మంచి టాక్ సొంతం చేసుకుని థియేటర్లలో దూసుకెళ్తోంది. అంతేకాదు.. ఈ సినిమాలో రష్మిక తర్వాత సెకండ్ హీరోయిన్‌గా నటించిన తృప్తి డిమ్రి(Tripti Dimri).. ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిగ్‌గా మారింది.

Tripti Dimri: Producers lined up for 'Animal' beauty.. Movie with Tollywood hero..!

 

ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే వేలల్లో ఉన్న ఫాలోవర్లు ఒక్క సినిమాతో మిలియన్ ఫాలోవర్లు వచ్చారంటే ఈ అమ్మడు క్రేజ్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. యానిమల్ సినిమాలో ఈ బ్యూటీ గ్లామర్ షోకు అంతా ఫిదా అయిపోయారు. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ బ్యూటీ కోసం దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది ఈ భామ. ఇదే ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ అవుతోంది. యానిమల్ సినిమాలో తన బ్యూటిఫుల్ లుక్స్‌తో సిల్వర స్క్రీన్‌పై కనిపించిన ఈ బ్యూటీ.. తన గ్లామర్‌తో యానిమల్ సినిమా సెకండ్‌ ఆఫ్‌ని హోల్డ్‌ చేసేసింది. దాంతో పాటే ఇండియన్ యూత్‌లో మంచి క్రేజ్‌ని సంపాదించుకుంది.

ఈ బ్యూటీకి టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సినిమాలో సూపర్ డూపర్ ఆఫర్ వచ్చిందిట. మరి రవితేజ సినిమాలో ఎలా మెప్పిస్తుందో చూడాలి. తృప్తి డిమ్రీ ఉత్తరాఖండ్‌లో 1997, ఫిబ్రవరి 23న జన్మించింది. 2017లో బాబీడియోల్, శ్రేయాస్ తల్పాడే నటించిన పోస్టర్ బాయ్స్ చిత్రంలో నటించింది. ఈ సినిమాతోనే సినీ ఇండస్ట్రీలోకి వచ్చింది. అదే సంవత్సరం శ్రీదేవి నటించిన ‘మామ్’ అనే సినిమాలో నటించింది.

You may also like

Leave a Comment