సినీ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు పాపులారిటీ సాధించాక బాలీవుడ్(Bollywood)లో అదృష్టాన్ని పరీక్షించుకోవడం పరిపాటే. ఇప్పటికే అనేక మంది నటీమణులు అలా వెళ్లి సక్సెస్ సాధించినవారు కొందరైతే.. మరికొందరు మాత్రం పలు కారణాలతో సౌత్‌లోనే సినిమాలు చేసుకుంటున్నారు. అయితే, రెండు దశాబ్దాలుగా తెలుగు, తమిళ సినిమాల్లో తిరుగులేని హీరోయిన్గా రాణిస్తోంది హీరోయిన్ త్రిష(heroine Trisha).
అప్పట్లో హిందీలో కట్టామిఠా(2010) సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో త్రిష సినిమా ఫెయిల్యూర్ కారణంగానే బాలీవుడ్లో అవకాశాలు రాలేదోమోనని అంతా అనుకున్నారు. ఇలాంటి ఊహాగానాలకు త్రిష క్లారిటీ ఇచ్చింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో హిందీ చిత్రం ప్లాఫ్ కావడంతో బాలీవుడ్ అవకాశాలు రాలేదా? అనే ప్రశ్నకు త్రిష బదులిచ్చింది.
‘‘ అందులో నిజం లేదు. ఆ సమయంలో నా కుటుంబాన్ని ముంబైకి మార్చడానికి మనసు ఒప్పుకోలేదు.. మరోవైపు ఇక్కడ చాలా సినిమాలు వదులుకోవాల్సి ఉంటుంది. అందుకే సౌత్‌లో నాకున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బాలీవుడ్ సినిమాలు వద్దనుకున్నా.’’ అని త్రిష చెప్పుకొచ్చింది.
దక్షిణాదిలో ఎన్నో ఏళ్ళుగా స్టార్ స్టేటస్‌ని అనుభవిస్తూ ఇప్పటికీ హీరోయిన్గా బిజీగా ఉన్న ఆమె కెరీర్ డౌన్ అయ్యింది.. ఇంకేంటి త్రిష పనైపోయింది అనుకున్నారు. కానీ పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్రిష సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టింది. నాలుగు పదుల వయసులోనూ త్రిష ఇప్పటికీ బిజీగా మారింది. ప్రస్తుతం కోలీవుడ్, టాలీవుడ్ టాప్ స్టార్స్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ కమల్‌హాసన్‌తో ‘థగ్‌లైఫ్’, చిరంజీవి సరసన ‘విశ్వంభర’, అజిత్‌తో ‘విడాముయర్చి’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది.