బీఆర్ఎస్ జగిత్యాల మున్సిపల్ కౌల్సిలర్లు ఎమ్మెల్యే సంజయ్ కుమార్((MLA Sanjay Kumar)) షాకిచ్చారు. ఇక్కడ బల్దియా ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మున్సిపల్ చైర్మన్(Jagtial Municipality) ఎన్నికలో సంజయ్ ఆదేశాలను ధిక్కరించి మరీ వేరే వాళ్లకు జైకొట్టారు కౌన్సిలర్లు.
దీంతో బీఆర్ఎస్ ప్రతిపాదించిన వాణి ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ మద్దతుదారు వాణికి కాకుండా కౌన్సిలర్లంతా అడువాల జ్యోతి(Aduvala Jyoti)కి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ కౌన్సిలర్లు(Congress) సైతం జ్యోతికే మద్దతు తెలపడం గమనార్హం. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే సంఖ్యా బలం ఉన్నప్పటికీ చైర్పర్సన్ పదవిని కోల్పోయారు వాణి.
జగిత్యాల మున్సిపల్లో మొత్తం 48 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బుధవారం నిర్వహించిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికకు 35 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఈ ఎన్నికలో వాణికి 23 ఓట్లు పడగా.. జ్యోతికి 24 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు.
దీంతో జగిత్యాల కొత్త మున్సిపల్ చైర్మన్గా అడువాల జ్యోతి ఎన్నికయ్యారు. జ్యోతికి బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతు లభించింది. ఐదుగురు కాంగ్రెస్ కౌన్సిలర్లు, ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు, ఒక ఎంఐఎం కౌన్సిలర్ హాజరయ్యారు. అయితే ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ అందుబాటులో లేకపోవడంతో గైర్హాజరుగా ప్రకటించారు.