Telugu News » అది ఓ డబుల్ ఇస్మార్ట్ స్కూల్ …!

అది ఓ డబుల్ ఇస్మార్ట్ స్కూల్ …!

ఇక్కడ స్టూడెంట్స్ అంతా ట్విన్సే

by sai krishna

ప్రపంచంలోరక రకాల స్కూల్స్ ఉన్నాయి.కానీ కొన్ని స్కూల్స్ చాలా ప్రత్యేకమైనవి. అంటే మా ఉద్దేశం.. ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సంబంధించిన స్కూల్స్ కాదు..! ప్రత్యేకమైన పిల్లలు చదివే స్కూల్. ఏవిటా ప్రత్యేకత..ఎందుకంత ప్రత్యేకత అనుకుంటున్నారా.!?


అది ఒక ట్విన్స్ స్కూల్. అంటే..ఆ స్కూల్లో చదివే పిల్లలంతా కవలలే అన్నమాట.!ఆశ్చర్యంగా ఉంది కదా..! ఇంకో వండర్ విషయం ఏంటంటే.. ట్రిపుల్స్ కూడా ఉన్నారు.ఈ కాన్సెప్ట్యువల్ స్కూల్.. ఇండియాలో ఉంది. పంజాబ్ జలంధర్ లోమూడు ట్రిపుల్స్..ఆరు ట్విన్స్ లా నడిచిపోతోంది.

సాధారణంగానే ఒకింట్లో ట్విన్స్ పుడితేనే స్పెషల్. అలాంటిది..ఒక స్కూల్ లో 42 మంది ట్విన్స్ అంటే ఇంకెలా ఉంటుందో ఇంకెంతలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోండి.జలంధర్ లోని పోలీస్ డీఏవీ స్కూల్లో ఈ ప్రత్యేకతకు వేదికైంది.ఇక్కడ ఎలిమెంట్రీ నుంచి పన్నెండో తరగతి దాకా చదివే కవలలు ఉన్నారు.


క్లాస్ లో ఒక జత కవలు ఉంటేనే..ఎవరికి ఏ వర్క్ ఇచ్చారో..అనేది టీచర్సే కన్ఫ్యూజ్ అయిపోతారు. అలాంటిది అంత మంది ట్విన్స్ తో అంటే అయ్యేపనేనా అనే డౌట్ వస్తోంది కదా..!?

అలాంటి ఇబ్బందులేవీ తాము పడటం లేదంటున్నారు టీచర్స్..ఎంత కవలలైనా కూడా వారి రూపాలు ఒకేలా ఉండొచ్చు గాక, వాళ్ల భావోద్వేగ పరిమితులు, పరిస్థితులు వేరేగా ఉంటాయి.అందువల్ల వారికి చదువు చెప్పడం పెద్ద కష్టం కాదంటున్నారు టీచర్లు.వాళ్లు ఆనందంగా చెప్పే మాటేంటంటే అంత మంది కవలలకు పాఠాలు చెప్పడం మా అదృష్టం అంటూ మురిసిపోతూ చెబుతున్నారు ఆ స్కూల్ టీచర్స్..!

You may also like

Leave a Comment