ట్విటర్(Twitter)ను హస్తగతం చేసుకున్న ఎలోన్ మస్క్(Elon Musk) తదనంతరం సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతూనే ఉన్నారు. ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూనే వచ్చే ఏడాది Xలో మస్క్ పెద్ద మార్పులు చేయనున్నారు. ట్విట్టర్(X) డేటింగ్ యాప్‌గా కూడా పనిచేయనుంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో లిండా యాకారినో(X Ceo Linda Yaccarino) చెప్పినట్లు ఓ నివేదిక వెల్లడించింది.
అదేవిధంగా ట్విటర్ త్వరలో డిజిటల్ బ్యాంక్‌గా పని చేస్తుందని, దీని ద్వారా బ్యాంక్ ఖాతా అవసరమూ ఉండదని మరో నివేదిక చెబుతోంది. మస్క్ బ్యాంక్ ఖాతా అవసరం లేకుండా తన ఆలోచనలకు పదును పెడుతున్నట్లు తెలుస్తోంది.
గతేడాది నవంబర్ ది వెర్జ్ రిపోర్టు ప్రకారం మస్క్ X బ్యాంక్‌గా మార్చాలనుకుంటున్నారు. ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగులతో జరిగిన మొదటి సమావేశంలో ట్విటర్‌ను డిజిటల్ బ్యాంక్‌గా మార్చాలనే ఆలోచనను మస్క్ పంచుకున్నట్లు ఇందులో తన డిజిటల్ బ్యాంక్ ఆలోచన అధిక లాభాల మనీ మార్కెట్ ఖాతాలు, డెబిట్ కార్డు, చెక్కులు, రుణాలకు సంబంధించినదని మస్క్ చెప్పారు.
ఖరీదైన క్రెడిట్ కార్డ్ సిస్టం, మెరుగైన ప్రత్యామ్నాయాన్ని వినియోగదారులకు అందించాలని మస్క్ ఆలోచిస్తున్నాడు. సానుకూల ఖాతాలు ఉన్న వినియోగదారులకు ట్విట్టర్ ఎక్కువ వడ్డీని ఇస్తుందని, రెడ్ ఖాతాలు ఉన్న వారి నుండి తక్కువ వడ్డీని వసూలు చేస్తుందని మస్క్ చెప్పారు.