విశ్వ సుందరి (Miss Universe) పోటీల్లో ఆసక్తికరు పరిణామం చోటు చేసుకోనుంది. ఈ ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీల్లో తొలిసారిగా ఇద్దరు లింగ మార్పిడి మహిళ (Trans Woman)లు పాల్గొననున్నారు. ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీల్లో అందాల భామలతో ట్రాన్స్ ఉమెన్ మరియా మాచెట్ (మిస్ పోర్చుగల్), రిక్కీ కొల్లీ ( మిస్ నెదర్లాండ్స్ ) పోటీ పడనున్నారు.
మరియా మాచెట్ , రిక్కీ కొల్లీలలో ఎవరూ విజయం సాధించిన మిస్ యూనివర్స్ కిరీటాన్ని సాధించిన తొలి ట్రాన్స్ ఉమెన్ గా చరిత్ర సృష్టించనున్నారు. ఇటీవల మిస్ పోర్చుగల్ పోటీల్లో మరియా మాచెల్ తన అందాలను ఆరబోశారు. ట్రాన్స్ జెండర్‌గా మారినప్పటి నుంచి తన జీవితంలో ఎదురైన సమస్యలు, తన కుటుంబ సభ్యులు తనకు అండగా నిలబడిన విధానాన్ని స్టేజిపై వివరించారు.
ఇక మిస్ నెదర్లాండ్స్ పోటీల్లో రిక్కీ కొల్లీ కూడా ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మీ గురించి మీరు ఒక్క మాటలో చెప్పండని రిక్కీ కొల్లినీ పోటీల్లో న్యాయ నిర్ణేతలు అడిగారు. దానికి ఆమె తన గురించి తాను ఒక్క మాటలో చెప్పాలంటే విజయం అని చెబుతానని పేర్కొంది. ఓ చిన్న పిల్లవాడిగా తన మార్గంలో ఇప్పటి వరకు వచ్చిన అన్ని సమస్యలను తాను జయించానన్నారు.
ఇప్పుడు తనను చూస్తే ఇక్కడ స్టేజీపై సాధికారత, ఆత్మ విశ్వాసం కలిగిన ట్రాన్స్ ఉమెన్ గా నిల్చున్నానని చెప్పారు. దీంతో ఆమె సమాధానానికి న్యాయ నిర్ణేతలు ముగ్దులు అయ్యారు. మిస్ యూనివర్స్ పోటీల్లో 2012లో కొన్ని మార్పులు చేశారు. మిస్ యూనివర్స్ పోటీల్లో ట్రాన్స్ ఉమెన్స్ ను అనుమతిస్తూ కొత్త నిబంధనలను నిర్వహకులు చేర్చారు.