ఆధునిక జీవన శైలిలో చోటు చేసుకున్న మార్పుల వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. డబ్బువెనక పరిగెత్తుతున్న మనిషి.. తన ఆరోగ్యం కొసం ఆలోచించడం మానేశాడు. ఫలితంగా పెద్దఎత్తున వ్యాధులు వెంటాడుతున్నాయి. అలాంటి వాటిలో యూరిక్ యాసిడ్ సమస్య ఒకటి. ఇటీవల కాలంలో ఈ వ్యాధి సర్వసాధారణంగా మారిపోయింది. అయితే నిపుణులు చెబుతున్న కొన్ని చిట్కాలు పాటిస్తే కేవలం 3 నెలల్లోనే యూరిక్ యాసిడ్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చని అంటున్నారు. అవేంటో తెలుసుకుందాం..
యూరిక్ యాసిడ్ (Uric Acid) లక్షణాలు కనిపించిన వారు మాంసాహారం (Non-Vegetarian) మానేసి కనీసం మూడు నెలలపాటు పూర్తిగా శాకాహారం (Vegetarian)తినవలసి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆకుపచ్చ కూరగాయలు.. అనగా ఆకు కూరలు, అరటి.. దీంతోపాటు దొండకాయ, బీరకాయ, పొడుగు ఆనపకాయ వంటివి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
కొంత మందికి ఉదయం టిఫిన్ చేయడం అలవాటు.. అప్పుడు ఉప్మా, పోహా, ఇడ్లీ, దోశ, సాంబారు, పలావు వంటివి కూడా తినవచ్చని ఆరోగ్య నిపుణులు (Health professionals) అంటున్నారు.. ఇక రెడ్ మీట్ తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ అమాంతం పెరిగిపోతుందని అందువల్ల మూడు నెలలు మాంసాహారానికి దూరంగా ఉండటం మంచిదంటున్నారు..
ప్రస్తుతం సమాజంలో చెడు ఆహారపు అలవాట్ల కారణంగా మనుషులను యూరిక్ యాసిడ్ సమస్య పట్టి పీడిస్తోంది. అసలు ఈ సమస్య ఒకప్పుడు మధ్య వయస్సులో లేదా వృద్ధాప్యంలో వస్తుండేది. కానీ ఇప్పుడు యువకులను కూడా వెంటాడుతోంది. ముఖ్యంగా నిత్యం మోతాదుకు మించి మద్యం తాగేవారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మరోవైపు యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల.. కాళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందువల్ల ఈ సమస్యను (Problem) నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో చికిత్స అందిస్తే మంచిదని వారు అంటున్నారు.
నోట్ : సామాజిక మాధ్యమాలలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలను తెలియచేయడం జరిగింది.. వీటిని ఆచరించే ముందు ఒకసారి సంబంధిత నిపుణుల సలహాల పాటించవలసిందిగా మనవి.