ప్రపంచాన్ని వణికించిన కోవిడ్ వైరస్ (covid virus) పేరు వింటే.. చాలా మందికి వెన్నులో వణుకు పుడుతుంది. ఈ వైరస్ దాటికి ఎన్నో కుటుంబాలు ఆచూకీ కోల్పోయాయి. కోవిడ్ వల్ల మరణించిన వారికి అందరూ ఉండి అనాధాలుగా దహన సంస్కారాలు నిర్వహించిన దృశ్యాలు ఇప్పటికీ కళ్ల ముందు మెదిలితే ప్రాణాలు విలవిలాలాడుతాయి. అయితే కోవిడ్ వచ్చినప్పటి నుంచి ప్రపంచంలో ఏదో ఒక మూల కొత్త కొత్త వైరస్ లకు సంబంధించిన వార్తలు తెరపైకి వస్తుండటం తరచుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరో కొత్త వైరస్ తెరపైకి వచ్చింది..
ఆ వైరస్ పేరు వాంపైర్ వైరస్ (Vampire virus) అని అంటున్నారు శాస్త్రవేత్తలు (Scientists)..ప్రస్తుతం అమెరికా (America)లో మొట్టమొదటి సారిగా వాంపైర్ వైరస్ వెలుగు చూసిందని.. అయితే గత కొంతకాలంగా వీటిపై పరిశోధనలు చేస్తున్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.. కాగా ఈ వైరస్ చాలా ప్రమాదకరమైనదిగా పేర్కొంటున్నారు. ఈ వైరస్ లు అమెరికా మేరీల్యాండ్ ( Maryland) మిస్సౌరీ (Missouri)లోని మట్టి నమూనాలలో గుర్తించినట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
మరోవైపు యూనివర్శిటీ ఆఫ్ మేరీల్యాండ్ బాల్టిమోర్ కౌంటీ పరిశోధకులు ఈ వైరస్ లకు మొబైల్ జెనిటిక్ ఎలిమెంట్స్ (MGES) అని నామకరణం చేశారు. కాగా ఈ ప్రమాదకరమైన వైరస్ లు ప్రజలకు సోకినప్పుడు సహాయక వైరస్లుగా మారుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు.. పందులలో కనుగొనబడిన ఇన్ఫ్లుఎంజా వైరస్ నమూనాలు కొత్త జాతులుగా ఉత్పత్తి చెందినప్పుడు మరింత ప్రమాదం పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.
ఇక ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ని ఉపయోగించడం ద్వారా మాత్రమే ఈ వైరస్ కనిపిస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. మరోవైపు అక్టోబర్ 31న జర్నల్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ మైక్రోబియల్ ఎకాలజీలో ప్రచురించబడిన అధ్యయనంలో ఈ వైరస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.