వేములవాడ(Vemulawada) శ్రీ రాజరాజేశ్వరస్వామి (Rajarajeswara Swamy) వారి ఆలయంలో మూడు రోజుల పాటు శివకళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి. ఈనెల మార్చి 27 నుంచి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమాలు మార్చి 31 వరకు శివ కళ్యాణోత్సవం వైభవంగా జరిపేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా నేడు(శుక్రవారం) స్వామివారికి ఆలయ అర్చకులు(priests) మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు.
ఆలయ అర్చకులు, జంగమ అర్చకులు కలిసి బలిహరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 8.05 గంటలకు శివకళ్యాణ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉదయం దైవసేవ నిర్వహించారు. అనంతరం ఈరోజు సాయంత్రం అంకురార్పణ, అగ్నిప్రతిష్ఠ, వాస్తు హోమం, శివ మహాపురాణ ప్రవచనం నిర్వహించనున్నారు. రాత్రి భేరీపూజ, దేవతా ఆవాహన, మంగళహారతి, మంత్ర పుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
అదేవిధంగా ఇవాళ తీర్థరాజస్వామి పూజ ఆవాహిత దైవార్చన, బలిహరణం, ఔపాసనం, కల్యాణ మండపంలో రాత్రి సభ, మంగళహారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం భక్తుల కోలాహలం మధ్య రథోత్సవం కనుల పండువగా నిర్వహించారు. ఆదివారం పూర్ణాహుతి, క్షేత్రపాలక బలి, ధర్మగుండంలో త్రిశూలయాత్ర, రాత్రి ఏకాదశ ఆవరణ, అనంతరం ఏకాంత సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఐదు రోజుల పాటు జరిగే శివ కల్యాణోత్సవ వేడుకలకు ఇక రెండు రోజులు ఉన్నందున.. ఆలయం లోపలి భాగాన్ని మామిడి, అరటి తోరణాలతో అలంకరించారు. ఇప్పటికే యాగశాల ప్రాంగణాన్ని సిద్ధం చేశారు. ఈ వేడుకలను తిలకించేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు తరలివస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వేసవి కాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ప్రాంగణంలో నీటి పందిళ్లు ఏర్పాటు చేశారు.