Telugu News » Venkaiah Naidu : సంస్కారం ఉండాలి…!  

Venkaiah Naidu : సంస్కారం ఉండాలి…!  

అందుకే మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని ఆయన తెలిపారు. మనిషికి చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.

by Ramu
venkaiah naidu advice to students on mother tounge

మాతృ భాష (Mother Tongue) కండ్ల లాంటిదని… పరాయి భాష కళ్లద్దాల వంటిదని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ( Venkaiah Naidu) అన్నారు. అందుకే మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని ఆయన తెలిపారు. మనిషికి చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యమని పేర్కొన్నారు.

venkaiah naidu advice to students on mother tounge

ఎస్ఎఫ్‌ఎస్ స్కూల్ గోల్డెన్ జూబ్లీ వేడుకల ముగింపు కార్యక్రమానికి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ… విలువలతో కూడిన విద్య ఉంటే విలువలతో కూడిన పౌరునిగా తయారవుతారని పేర్కొన్నారు. నేడు విలువలతో కూడిన విద్య తగ్గి పోతోందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిణామాలు మంచివి కాదని అన్నారు.

విలువలతో కూడిన విద్యను అందించడానికి అందరూ కృషి చేయాలని కోరారు. దేశంలో ఉన్న మేధాశక్తి వలన మళ్లీ ప్రపంచం అంతా భారతదేశం వైపు చూస్తోందని వెల్లడించారు. ఇటీవల అసెంబ్లీ, పార్లమెంట్‌లలో కొంతమంది అపహాస్య పనులు చేస్తున్నారని మండిపడ్డారు. వాటిని చూడకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు. రాజకీయ నాయకులు తమ స్థాయి మరచి చౌకబారు మాటలు మాట్లాడకూడదని హితవు పలికారు.

ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు ఎక్కువగా బూతులు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారికి ప్రజలు పోలింగ్ బూత్‌లో సమాధానం చెప్పాలని పిలుపునిచ్చారు. భగవంతుడు ఏం కావాలని అడిగితే మళ్ళీ విద్యార్థి దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటానని చెప్పారు గూగుల్ గురువుని మించింది కాదన్నారు.

You may also like

Leave a Comment