Telugu News » VH : ఒవైసీ షేర్ అయితే, రాహుల్ గాంధీపై పోటీ చేయాలి: వీహెచ్

VH : ఒవైసీ షేర్ అయితే, రాహుల్ గాంధీపై పోటీ చేయాలి: వీహెచ్

నాన్ సెక్యులర్ అయిన ఒవైసీ.. సెక్యులర్ అయిన రాహుల్ గాంధీపై ఇలాంటి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓవైసీ ఎప్పుడు దేశంలో ఉన్న ముస్లింల వ్యాఖ్యలు గురించే తప్ప హిందువుల గురించి పట్టించుకోరని అన్నారు.

by Prasanna
vh

ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి దమ్ముంటే వయనాడ్ వెళ్లి రాహుల్ గాంధీపై పోటీ చేసి గెలవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ లో తనపై పోటీ చేయాలని అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీపై అసద్ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమని వీహెచ్ మండిపడ్డారు.

vh

నాన్ సెక్యులర్ అయిన ఒవైసీ.. సెక్యులర్ అయిన రాహుల్ గాంధీపై ఇలాంటి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఓవైసీ ఎప్పుడు దేశంలో ఉన్న ముస్లింల వ్యాఖ్యలు గురించే తప్ప హిందువుల గురించి పట్టించుకోరని అన్నారు. ఓల్డ్ సిటీలో ఓవైసీని షేర్ అని పిలుస్తారని.. ఒవైసీ నిజంగా షేర్ అయితే వయనాడ్ వెళ్లి రాహుల్ గాంధీపై పోటీ చేయాలన్నారు. రాహుల్ గాంధీ హైదరాబాద్ కు వచ్చి ఎందుకు పోటీ చేస్తారు? రాహుల్ కు ఏం అవసరం అని ప్రశ్నించారు.

అక్టోబర్ 10 షాద్ నగర్ లో బీసీ డిక్లరేషన్ సభకు కర్నాటక సీఎం సిద్ధరామయ్య ముఖ్య అతిథిగా వస్తున్నారని వీహెచ్ వెల్లడించారు. సామాజిక న్యాయం కోసం రాహుల్ గాంధీ కృషి చేస్తున్నారని అందులో భాగంగానే బీసీ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు. బీసీ సబ్ ప్లాన్, కుల గణన, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ల అమలు రాజకీయ ప్రాధాన్యం తదితర అంశాలపై ఈ సభ ద్వారా పార్టీ నిర్ణయాన్ని ప్రకటిస్తామన్నారు. బీసీలు అండగా ఉంటేనే పార్టీ విషయం సాధిస్తుందన్నారు.

కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి అసదుద్దీన్ ఒవైసీ ఆదివారం ఓ బహిరంగ సభలో సవాల్ విసిరిన విషయం తెలిసిందే. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని ఒవైసీ చాలెంజ్ చేశారు.

‘మీ నాయకుడు రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో వయనాడ్ నుంచి కాకుండా హైదరాబాద్ నుంచి పోటీ చేయాలని సవాల్ విసురుతున్నాను. మీరు పెద్ద పెద్ద స్టేట్ మెంట్లు ఇస్తూనే ఉన్నారు. క్షేత్రస్థాయిలో నాతో తలపడండి’ అని కాంగ్రెస్ నాయకులను ఉద్దేశించి ఒవైసీ అన్నారు. దానికి కౌంటర్ గానే వీహెచ్ ఒవైసీని వయనాడ్ నుంచి పోటీ చేయాలని ఛాలెంజ్ విసిరారు.

You may also like

Leave a Comment