నటుడు విజయ్ కాంత్ ఆసుపత్రి నుండి కోలుకుని మళ్ళీ బాగు అయిపోతారని అంతా అనుకున్నారు. కానీ ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం, కరోనా వలన చనిపోయారు ఆయన మరణం తమిళ ప్రజలకి తెలుగు ప్రజలకి కూడా తీరనిలోటు. విజయ్ కాంత్ రాజకీయాలు సినిమాల్లో కూడా బిజీగా ఉండేవారు. విజయ్ కాంత్ పొలిటికల్ లైఫ్ గురించి మనకి చాలా విషయాలు తెలుసు అలానే ఆయన సినిమా కెరియర్ గురించి కూడా మనకి ఎన్నో విషయాలు తెలుసు. పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలు చాలామందికి తెలియదు.
విజయ్ కాంత్ ప్రేమ కథ గురించి విజయ్ కాంత్ పిల్లల గురించి ఇప్పుడు చూద్దాం విజయ్ కాంత్ ప్రేమ లతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. విజయ్ కాంత్ కంటే ఆమె 17 ఏళ్లు చిన్నది. వీళ్ళ పెళ్లి టైం కి ఆమె వయసు ఎంత అంటే కేవలం 21 సంవత్సరాలు మాత్రమే. విజయ్ కాంత్ పెళ్లి చూపులప్పుడు, ప్రేమలత తండ్రి ఆయన్ని చూసి ఎంత వినయంగా ఉన్నారో. అసలు హీరో అన్న అహమే లేదు అని అల్లుడు ఈయనే అని ఫిక్స్ అయిపోయారు. ప్రేమలత కూడా విజయ్ కాంత్ ని ఇష్టపడ్డారు ఇద్దరు కూడా ఒకరినొకరు అర్థం చేసుకున్నారు.
Also read:
పెళ్లి నాటికి వీళ్ళిద్దరికీ ఒక అండర్స్టాండింగ్ ఏర్పడింది ఇలా వీళ్ళు మంచి ప్రేమికులుగా మారారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పెద్ద కొడుకు పేరు విజయ ప్రభాకర్. విజయ్ ప్రభాకర్ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటుంటారు. రెండో కొడుకు పేరు షణ్ముఖ పాండియన్ షణ్ముఖ పాణ్యం సినిమాల్లో బిజీగా ఉంటున్నారు. పెద్దకొడుకు నిశ్చితార్థం నాలుగేళ్ల క్రితం అయిపోయింది. కానీ కరోనా రావడం ఇలా పలు కారణాల వలన పెళ్లి జరగలేదు త్వరలో విజయ్ కాంత్ పెద్ద కొడుకు పెళ్లి జరగనుంది. చనిపోయిన ఇంట ఏడాదిలోగా శుభకార్యం చేస్తే మంచి జరుగుతుందని అంటారు కనుక ఏడాదిలోగా పెళ్లి చేసుకోవచ్చు.