Telugu News » Vijayasai Reddy: ‘వెన్నుపోటు కుట్రలో కత్తి అందించింది పురంధేశ్వరే..’ ఎంపీ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

Vijayasai Reddy: ‘వెన్నుపోటు కుట్రలో కత్తి అందించింది పురంధేశ్వరే..’ ఎంపీ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

సీనియర్‌ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో కత్తి అందించింది పురంధేశ్వరే..’ అంటూ ఆరోపించారు. ట్విట్టర్(X) వేదికగా సాయిరెడ్డి వరుస ట్వీట్లతో పురంధేశ్వరిపై హాట్ కామెంట్లు చేశారు.

by Mano
Vijayasai Reddy: 'Purandheshwar provided the knife in the backbiting conspiracy..' MP Sai Reddy's sensational comments..!

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి(Vijaya sai Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్‌ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన కుట్రలో కత్తి అందించింది పురంధేశ్వరే..’ అంటూ ఆరోపించారు. ట్విట్టర్(X) వేదికగా సాయిరెడ్డి వరుస ట్వీట్లతో పురంధేశ్వరిపై హాట్ కామెంట్లు చేశారు.

Vijayasai Reddy: 'Purandheshwar provided the knife in the backbiting conspiracy..' MP Sai Reddy's sensational comments..!

ఈ ఆదర్శ దంపతులు సిగ్గు విడిచి పదవీ కాంక్షతో అప్పట్లో బాబుగారి ఇంటికి వెళితే తలుపులు తెరవకుండా తరిమికొట్టినా మళ్లీ ఆయన పల్లకి మోస్తున్నారని ఎద్దేవా చేశారు.  ‘అన్న టీడీపీ’ అనే పార్టీని ప్రేరేపించి నందమూరి హరికృష్ణతో ప్రారంభించి.. తనే కొబ్బరికాయ కొట్టి.. కొంతకాలం గౌరవ అధ్యక్షురాలిగా పనిచేసినట్లు గుర్తుచేశారు. ఆ పార్టీ ఓడిపోవడంతో కాంగ్రెస్‌లో చేరి సోనియాగాంధీని పొగడ్తలతో ముంచెత్తిన ఘనురాలు ఈవిడ..’ అంటూ సెటైర్లు విసిరారు.

 

ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచిన కుట్రలో చంద్రబాబుకు కత్తి అందించింది పురంధేశ్వరి, ఆమె భర్త వెంకటేశ్వర్‌రావులే అని సాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని, తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా అని ఆరోపించారు. ఎమ్మెల్యేలు వెంటలేకున్నా అంతా తన వైపు వచ్చారని బాబు ఎల్లో మీడియాలో రాయించుకోవడం ఒక ఎత్తయితే, ఎన్టీఆర్ కుమారులను తండ్రిపైకి ఉసిగొల్పిన ఘనచరిత్ర పురందేశ్వరిది అని విమర్శించారు.

‘ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తోందని, విలువల్లేని రాజకీయాలు చేస్తున్న ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారు.’ ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో బహునేర్పరి పురంధేశ్వరి. ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉంటూ ఇంకోవైపు టీడీపీకి అనధికార గౌరవ అధ్యక్షురాలుగా కొనసాగడం అనైతికం’ అంటూ దుయ్యబట్టారు. కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రిగా ఉన్నా రాష్ట్ర విభజనలో తనవంతు శకుని పాత్ర పోషించి, రాష్ట్రాన్ని నాశనం చేసిన మహా గొప్ప మహిళ అంటూ పురంధేశ్వరిపై సాయిరెడ్డి ఘాటు విమర్శలు గుప్పించారు.

 

You may also like

Leave a Comment