వినేవాడు ఉండాలేగాని..చెప్పేవాడు దేవుడైపోతాడు. ఈ క్రమంలోనే విజయవాడ (Vijayawada)లో సరికొత్త బాబా వెలిశాడు. నిజానికి ఒక్కో బాబా ఒక్కో విన్యాసంలో ఎక్సెపెర్ట్ ..మన విజయవాడ బాబా అయితే మేకులు కొట్టడంలో స్పెషలిస్టు.
మేకులు కొడుతున్నాడని కార్పెంటరు అనుకోకండి..!అందుకే మనబాబాకి మేకుల బాబా అని పేరు, నేలపై మేకు కొట్టాడంటే భక్తుడు లక్షలు కుమ్మరించాల్సిందే .ఇలా గుట్టు చప్పుడు కాకుండా భక్తుల అమాయకత్వంపై మేకులు కొట్టుకుంటూ బతికేస్తున్నాడు. మరి ఎట్లా బట్టబయలు అయ్యాడనుకుంటున్నారా..!?
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన సుంకర రజనీ మచిలీపట్నం ఇనకుదురులో 14 సెంట్ల స్థలం కొనుగోలు చేసింది. తిరిగి అమ్ముడు పోలేదు. ఈ క్రమంలో ఓ మహిళ ‘మౌలాల(Maulala)’ అనే బాబాను రజనీకి పరిచయం చేసింది.
స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో మేకులు కొట్టాలని చెప్పి రూ.2.5 లక్షలు తీసుకుని 4 మేకులు పాతాడు. 100 గజాలు అమ్ముడుపోయేలా చేసి 4 లక్షలు ఇవ్వకపోతే శాపం తగులుతుందని బెదిరించాడు. క్రమంగా వేధింపులు పెరగడంతో చివరకు ఆమె పోలీసులను ఆశ్రయించింది.
రజనీ మచిలీపట్నం(Machilipatnam)ఇనకుదురు( Inakududru)లో 14 సెంట్ల స్థలాన్ని 35 లక్షల రూపాయలతో కొనుగోలు చేసింది. అంత డబ్బు పెట్టి కొన్న స్థలం అమ్ముడవ్వకపోవడంతో మౌలాల అనే దొంగ బాబాను ఓ భక్తురాలు రజనీకి పరిచయం చేసింది.
స్థలం అమ్ముడు పోవాలంటే స్థలంలో నలుదిక్కులా నాలుగు మేకులు కొట్టాలంటూ మౌలాల సూచించాడు. రెండున్నర లక్షలు తీసుకుని పూజలు చేసి నాలుగు మేకులు పాతి పెట్టిన మౌలాల…నమ్మకం కుదిరేందుకు 100 గజాలు అమ్మించాడు.
స్థలం అమ్మిన తర్వాత నాలుగు లక్షలు కమీషన్ ఇవ్వకపోతే శాపం తగులుతుందని భయపెట్టడం మొదలుపెట్టాడు. మోసపోయామని గుర్తించిన బాధితురాలు రజనీ..ఇనకుదురు పోలీసులను ఆశ్రయించింది
దీంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మెకుల బాబా…నమ్మించి మోసం చేసిన ఘటన ఇప్పుడు బెజవాడ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది.
తన దగ్గర రూ.2.5వరకు తీసుకుని బాబా పూజలు చేసినట్లు బాధితురాలు పేర్కొంటోంది. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.