తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్(Vijaykanth) అనారోగ్యంతో ఉన్నారని, ఆయన పరిస్థితి విషమంగా వుందన్న వార్తలు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే, ఆ వార్తలను విజయ్‌కాంత్ భార్య ప్రేమలత(Premalatha) ఖండించారు. వారి రెండో కుమారుడు షణ్ముగ పాండియన్ విజయకాంత్‌ను కలిసిన ఫోటోలను షేర్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు.
‘విజయకాంత్ క్షేమంగా ఉన్నారు, రెండు రోజుల్లో మీకు శుభవార్త వస్తుంది. విజయకాంత్ అతి త్వరలో తిరిగి బయటకు రానున్నారు. ఆయన తప్పకుండా వచ్చి అందరినీ కలుస్తారు” అని ప్రేమలత అన్నారు. ఈ సందర్భంగా ఆ వీడియో ఆమె మాట్లాడుతూ.. ‘2 రోజుల కిందట నేను ఇలాంటి వీడియో విడుదల చేశాను. విజయకాంత్ బాగానే ఉన్నారు. తప్పుడు వదంతులు ప్రచారం చేయవద్దని కోరుతున్నా’ అని తెలిపారు.
ఈ అవాస్తవాలను పార్టీ కార్యకర్తలు, నిర్వాహకులు, మా కుటుంబాలు, బంధువులు, సినీ పరిశ్రమకు తీవ్ర మనోవేదన కలిగిస్తున్నాయని ఆమె అన్నారు. తాము విజయకాంత్‌తో ఆసుపత్రిలోనే ఉన్నామని, అయితే సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు మాత్రం తిరుగుతూనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మానవత్వంతో ఆలోచించి దయచేసి తప్పుడు వార్తలను వ్యాప్తి చేయొద్దని కోరారు.
విజయ్‌కాంత్‌కు ట్రాకియోస్టోమీ అని, వెంటిలేటర్లో ఉంచారని ప్రేమలత చెప్పారు. కృత్రిమ శ్వాసక్రియ చేశారని, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ జయకాంత్ను కలిసి తనను ఓదార్చారని తెలిపారు. యూట్యూబ్ ఛానెల్స్, ఛానళ్లు తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
கேப்டன் ஆரோக்கியமாக இருக்கிறார்.
வெகு விரைவில் கேப்டன் நல்ல உடல் நலத்துடன் வீடு திரும்புவார், நம் அனைவரையும் சந்திப்பார்.
யாரும் வதந்திகளை பரப்பவும் வேண்டாம், நம்பவும் வேண்டாம்! என்று அன்போடு கேட்டுக்கொள்கிறேன்.– திருமதி. பிரேமலதா விஜயகாந்த். pic.twitter.com/sbzd0FDOX4
— Vijayakant (@iVijayakant) December 2, 2023