అంబేడ్కర్ కోనసీమ(Ambedkar konaseema) జిల్లా అయినవిల్లి స్వయంభు విఘ్నే శ్వర స్వామి(swayambhu vigneshwara swamy) ఆలయంలో చవితి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. వినాయక చవితి సందర్బంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో అలంకరించి సర్వంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ప్రతి ఏడాది భాద్రపద మాసం శుద్ద చవితి రోజున వార్షికంగా స్వామివారికి వినాయక చవితి మహోత్సవాలు నిర్వహిస్తారు. తొమ్మిది రోజుల పాటు ఈ చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వినాయక చవిత సందర్బంగా ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. ఉదయం నుంచే వినాయకుని భక్తులు పూజలు చేస్తున్నారు.
కాణిపాక వినాయకుని ఆలయం తర్వాత ఈ ఆలయం అంత ప్రసిద్ధి చెందినది అధికారులు చెబుతున్నారు. అందుకే అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వస్తున్నారు. భక్తుల కోసం ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశామని అధికారులు చెబుతున్నారు.
ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. భక్తుల రద్దీ నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు అధికారులు తెలిపారు. భక్తులకు తాగు నీటి సౌకర్యం కల్పించామన్నారు. పిల్లలకు పాలు, భక్తులకు ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు