ప్రపంచకప్లో రన్ మెషిన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) రికార్టుల మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఇప్పటికే సచిన్ ( Sachin)పేరిట ఉన్న 49 సెంచరీల రికార్డును సమం చేసి కోహ్లీ చరిత్ర సృష్టించారు. తాజాగా హాఫ్ సెంచరీల విషయంలోనూ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును విరాట్ కోహ్లీ సమం చేశాడు.
నెదర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో నిన్న విరాట్ కోహ్లీ నిన్న అర్ధ సెంచరీ చేశాడు. దీంతో ఈ ప్రపంచకప్ తన ఏడవ అర్ధసెంచరీని విరాట్ కోహ్లీ నమోదు చేశాడు. దీంతో ప్రపంచకప్ ఒక ఎడిషన్ లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్, షకీబ్ అల్ హసన్ సరసన విరాట్ కోహ్లీ నిలిచారు.
2003 వరల్డ్ కప్ లో సచిన్ బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించారు. ఆ సిరీస్ లో ఏకంగా ఏడు అర్ధ సెంచరీలు బాదాడు. ఆ తర్వాత 2019 వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్ బ్యాటర్ షకీబు అల్ హసన్ కూడా ఏడు అర్ధ సెంచరీలు పూర్తి చేసి సచిన్ తర్వాత ఆ రికార్డు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
ఈ వరల్డ్ కప్లో విరాట్ కోహ్లీ మంచి ఊపు మీద ఉన్నాడు. రాబోయే మ్యాచ్ ల్లో కోహ్లీ సెంచరీ లేదా హాఫ్ సెంచరీ సచిన్ పేరిట ఉన్న ఆ రెండు రికార్డులను కోహ్లీ బద్దలు కొడతారు. దీంతో ఆయన అద్బుతమైన ఇన్నింగ్స్ కోసం క్రికెట్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇది ఇలా వుంటే వరల్డ్ కప్ లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా విజయాల్లో భారత్ ట్రిపుల్ హ్యట్రిక్ కొట్టింది.