Telugu News » Vishwak Sen : టాలీవుడ్ యంగ్ హీరోకి గాయాలు.. వీడియో వైరల్..!!

Vishwak Sen : టాలీవుడ్ యంగ్ హీరోకి గాయాలు.. వీడియో వైరల్..!!

విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో నేహా శెట్టి హీరోయిన్‌గా చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది

by Venu

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) షూటింగ్ చేస్తున్న సమయంలో లారీ పై నుంచి జారిపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గ్యాంగ్స్ అఫ్ గోదావరి (Gangs oF Godavari) మూవీ షూటింగ్ జరుగుతున్న స్పాట్ లో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు సమాచారం.

ఫైటింగ్ సీన్ లో భాగంగా రౌడీలని కొట్టే క్రమంలో విశ్వక్ సేన్ పై నుంచి దూకి.. కింద వేసిన పరుపులపై పడాల్సి ఉంది. కానీ విశ్వక్ సేన్ టైమింగ్ మిస్ అవడం వల్ల పరుపు పై కాకుండా కిందకి జారిపడిపోయినట్టు వీడియోలో కనిపిస్తుంది.. అయితే ఈ ప్రమాదంలో విశ్వక్ స్వల్పంగా గాయపడినట్టు తెలుస్తుంది. కాగా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ప్రస్తుతం విశ్వక్ సేన్ క్షేమంగా ఉన్నట్లుగా చిత్ర బృందం (Film Team) వెల్లడించింది. ఈమేరకు ఈ ప్రమాదం జరగగానే చిత్ర బృందం షూటింగ్ కి ప్యాకప్ చెప్పేసినట్లుగా సమాచారం. మరోవైపు విశ్వక్ జారిపడిపోతున్న విజువల్స్ (Visuals)చూసిన అభిమానులు ఏమైనా దెబ్బలు తగిలాయేమోనని ఆందోళన పడుతున్నట్టు తెలుస్తుంది.

ఇక విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న గ్యాంగ్ ఆఫ్ గోదావరిలో నేహా శెట్టి హీరోయిన్‌గా చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్, పాటలు సినిమాపై హైప్ క్రియేట్ చేసింది.. మరోవైపు డిసెంబర్ 8న ఈ సినిమా విడుదల చేయాలని నిర్మాతలు భావిస్తున్న సమయంలో విశ్వక్ గాయపడటంతో అనుకున్న సమయానికి ఈ మూవీ రిలీజ్ అవుతుందా లేదా అనేది అనుమానంగా ఉందని టాక్..

You may also like

Leave a Comment