Telugu News » విమానం-ట్రక్కు ఢీ.. 140 మంది..!?

విమానం-ట్రక్కు ఢీ.. 140 మంది..!?

by admin
vistara-aircraft-engine-was-hit-by-a-tow-truck-at-mumbai-airport

ముంబయి ఎయిర్ పోర్ట్ లో భారీ విమాన ప్రమాదం తప్పింది. విస్తారా ఎయిర్ లైన్స్ కు సామాన్లు తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టడంతో ఎయిర్ విస్తారా విమాన ఇంజన్ దెబ్బతింది. అప్పటికి విమానంలో 140 మంది ప్రయాణికులు ఉన్నారు.సంతోషకరమైన విషయం ఏంటంటే వారెవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.

vistara-aircraft-engine-was-hit-by-a-tow-truck-at-mumbai-airport

‘ఆగస్టు 1న ముంబయి నుంచి కోల్‌కతాకు బయలుదేరిన విమానాన్ని సామాన్లు తీసుకెళ్లే ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానం ఇంజిన్ దెబ్బతింది. ప్రస్తుతం దెబ్బతిన్న ఇంజన్ కు మరమత్తులు చేస్తున్నామని’ అధికారులు వెల్లడించారు.

‘ప్రయాణికులకు ప్రత్యామ్నాయ విమానాన్ని ఏర్పాటు చేసి గమ్య స్థానాలకు తరలించాం. అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ గాయాలు కాలేదు.’ అని విస్తార్ ఎయిర్లైన్స్ ఉద్యోగి తెలిపారు.

ఈ ఏడాది జనవరిలో కూడా ఎయిర్ విస్తారా యూకే-781 విమానానికి ఢిల్లీ నుంచి భువనేశ్వర్‌ వెళ్తున్న ఈ విమానానికి హైడ్రాలిక్ సమస్య తలెత్తింది. అప్రమత్తమైన డీజీసీఏ విమానానికి అత్యవసర పరిస్థితి ప్రకటించింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు.

అనంతరం విమానం అత్యవసరంగా ల్యాండ్ అవ్వాలని ఆదేశాలు జారీ చేయగా.. వెంటనే ఢిల్లీలో పైలెట్లు అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలో దాదాపు 140 మంది ప్రయాణికులు ఉన్నట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు.

You may also like

Leave a Comment