Telugu News » Viswambara Movie: ఇట్స్ అఫీషియల్.. 18 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్..!

Viswambara Movie: ఇట్స్ అఫీషియల్.. 18 ఏళ్ల తర్వాత కాంబో రిపీట్..!

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ సినిమా ‘విశ్వంభర’. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్రకటించింది. 18ఏళ్ల కిందట చిరంజీవితో ‘స్టాలిన్‌’ సినిమాలో నటించింది త్రిష.

by Mano
Viswambara Movie: It's Official.. Combo Repeat After 18 Years..!

పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న లేటెస్ట్ సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నారు.

Viswambara Movie: It's Official.. Combo Repeat After 18 Years..!యూవీ క్రియేషన్స్ సంస్థ సుమారు రూ.200కోట్లతో బ‌డ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా, ఈ సినిమాకు సంబంధించి సాలిడ్ అప్‌డేట్ ఇచ్చారు మేక‌ర్స్. ఈ మూవీలో స్టార్ హీరోయిన్ త్రిష హీరోయిన్‌గా న‌టిస్తున్న‌ట్లు చిత్ర‌యూనిట్ ప్రకటించింది.

ఇక ‘విశ్వంభర’ షూటింగ్‌లో చిరంజీవితో పాటు త్రిష కూడా జాయిన్ అయిన‌ట్లు వెల్ల‌డించింది. 18ఏళ్ల కిందట చిరంజీవితో ‘స్టాలిన్‌’ సినిమాలో నటించింది త్రిష. మళ్లీ ఇన్నాళ్లకు మెగాస్టార్‌తో జతకట్టనుంది. మూవీ షూటింగ్‌లో చిరంజీవి కూడా జాయిన్ అయ్యాడు. ఇక ఈ సినిమా కోసం చిరంజీవి ఫిజికల్‌గా ఫిట్‌గా తయారయ్యారు.

Viswambara Movie: It's Official.. Combo Repeat After 18 Years..!దీనికి సంబంధించి ఇటీవల ఆయన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన జిమ్‌ వీడియో వైరల్‌గా మారింది. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండ‌గా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

You may also like

Leave a Comment