మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే.. శరీరానికి అన్ని రకాల పోషకాలు తగిన మోతాదులో అవసరం. ఈ పోషకాలు శరీరానికి సరిపడా అందకుంటే.. దేహం రోగాల మయం అవుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. కాగా శరీరానికి అవసరమైన పోషకాలలో విటమిన్ సీ కూడా చాలా ముఖ్యమైనది. మన శరీరం ఇనుమును గ్రహించడంలో సహాయపడే గుణం ఉన్న విటమిన్ సీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో తోడ్పడుతుందని నిపుణులు అంటున్నారు.
అదీగాక హానికరమైన ఫ్రీ రాడికల్స్ (Free radicals) నుండి విటమిన్ సీ శరీరాన్ని రక్షిస్తుంది. అయితే ఈ విటమిన్ సీ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏంటో నిపుణులు తెలియచేస్తున్నారు. వీటిని నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్ర అనారోగ్య సమస్యలు (Health problems) వస్తాయని వారు అంటున్నారు.
విటమిన్ సీ (Vitamin C) లోపం వల్ల అలసట.. బలహీనత కలుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. మీకు తరచుగా ఈ లక్షణాలు కనిపిస్తే ఇది కూడా విటమిన్ సీ లోపం యొక్క లక్షణం కావచ్చంటున్నారు. నిజానికి, విటమిన్ సీ అనేది మన శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడానికి సహాయపడే ఒక పోషకం.
విటమిన్ సీ లోపం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు (Health professionals) తెలియచేస్తున్నారు. ఈ లోపం ఉన్నవారు తరచుగా జలుబు, దగ్గు, ఇతర ఇన్ఫెక్షన్లకు గురవుతారని అంటున్నారు. శరీరం ఇన్ఫెక్షన్తో పోరాడటానికి కావలసిన రోగనిరోధక శక్తి విటమిన్ సీ వల్ల లభిస్తుందని.. ఈ లోపం ఉంటే రోగనిరోధక తక్కువ అవుతుందని ఆరోగ్యనిపుణులు అంటున్నారు.
ఇక విటమిన్ సీ ఆరోగ్యకరమైన చర్మానికి సహాయకారిగా ఉంటుందన్న నిపుణులు.. శరీరానికి అవసరమైన ప్రొటీన్ అయిన కొల్లాజెన్ ఉత్పత్తి చేస్తుందని తెలుపుతున్నారు. ఒక వేళ విటమిన్ సీ లోపిస్తే శరీరంలో కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గి చర్మం పొడిబారే అవకాశం ఉందంటున్నారు.
విటమిన్ సీ లోపం ఉన్నప్పుడు కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.. విటమిన్ సీ శరీరంలో తగిన మోతాదులో ఉంటే ఒక శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ విడుదల చేసి వ్యాధుల బారి నుండి కాపాడుతుందని నిపుణులు వెల్లడిస్తున్నారు.
అందుకే మీ రోజువారీ ఆహారంలో విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు, కూరగాయలను ఉపయోగించండి.. ఆరోగ్యంగా ఉందండని నిపుణులు తెలియచేస్తున్నారు. ఒకవేళ పైన పేర్కొన్న లక్షణాలు కనిపిస్తే.. వెంటనే వైద్యుడిని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఉత్తమం అని అంటున్నారు.
నోట్ : సామాజిక మాధ్యమాలలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలను తెలియచేయడం జరిగింది.. వీటిని ఆచరించే ముందు ఒకసారి సంబంధిత నిపుణుల సలహాల పాటించవలసిందిగా మనవి.