తెలంగాణ (Telangana) ప్రభుత్వం రాష్ట్ర వ్యవసాయ ఉద్యాన వర్సిటీ భూములను హైకోర్టు (High Court)కు కేటాయిస్తూ జారీ చేసిన జీవో 55పై నిరసనలు వెల్లువెత్తుతోన్నాయి.. రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ ప్రేమావతిపేట సమీపంలో, హైకోర్టు నూతన భవనానికి 100 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ రేవంత్ (Revanth) సర్కార్ జారీ చేసింది. ఈ క్రమంలో జీవోను రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు.
వరంగల్ (Warangal) జిల్లా హైకోర్టుకు వ్యవసాయ యూనివర్సిటీ భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ఆరెపల్లి అగ్రికల్చర్ కాలేజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో 55పై నిరసన తెలియచేస్తూ.. భారీ ర్యాలీ నిర్వహించారు. అగ్రికల్చర్ వర్సిటీ అంటేనే రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి మేలు చేకూర్చి, దేశంలోనే అగ్రగామిగా చేసి, రైతులకు నష్టాలు జరగకుండా పరిశోధనలు నిర్వహిస్తుందని అన్నారు..
భవిష్యత్తు తరాలకు వ్యవసాయ పరిశోధనలు ఎంతో ఉపయోగ పడతాయని విద్యార్థులు తెలిపారు. వ్యవసాయ రంగానికి భూములు ఇవ్వాల్సిన ప్రభుత్వమే లాక్కోవడం అన్యాయమని ఆరోపించారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను కాపాడుకుంటామని తెలిపిన విద్యార్థులు.. ఎంతవరకైనా పోరాడుతాం వరంగల్ అగ్రికల్చర్ భూములను కాపాడుకొంటామని వెల్లడించారు..
తక్షణమే హైకోర్టుకు మంజూరు చేసిన GO ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.. వ్యవసాయ విశ్వవిద్యాలయం కు సంబంధించిన స్థలంలో ఒక్క గజం కూడా ఇవ్వడానికి వీలులేదన్నారు. హైకోర్టు నిర్మాణ ప్రతిపాదనను వేరే చోటుకు మార్చాలని హెచ్చరించారు. అగ్రికల్చర్ వర్సిటీలో హైకోర్టు భవనాలను కట్టడం అంటే రాష్ట్రంలోని వ్యవసాయ రంగాన్ని తుంగలో తొక్కి వ్యవసాయ అభివృద్ధికి అడ్డుకట్ట వేయడమేనని మండిపడ్డారు..