చాలా మందికి ఉదయాన్నే గోరు వెచ్చని నీరు తాగడం అలవాటు. ఈ అలవాటు మంచిదే అయిన.. ఇందులో వంటగదిలో ఉన్న మరి కొన్ని ఐటెమ్స్ కలుపుకుని తాగితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం రుచిని పెంచడానికి ఉపయోగించే సుగంధ ద్రవ్యాలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయని తెలుపుతున్నారు. ఇంతకు వేడి వాటర్ లో ఏం కలుపుకుని తాగాలని ఆలోచిస్తున్నారా..
అవే అందరి ఇంటిలో ఉండే దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీర.. అయితే ఈ పదార్థాలను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. ఇవి అనేక సమస్యల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడతాయని, శీతాకాలంలో సీజనల్ వ్యాధుల బారిన పడే ప్రమాదం తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన వారు.. ఈ కషాయాలను తాగితే రోగనిరోధక శక్తి బలోపేతం కావడానికి అవకాశం ఉందని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అయితే వీటి వల్ల కలిగే లాభాలను చూస్తే..
ఎవరైనా మలబద్ధకం (Constipation) సమస్యతో ఇబ్బంది పడుతుంటే రాత్రి పడుకునే ముందు వేడి నీటిలో దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీర కలిపి కషాయం తయారు చేసుకుని తాగవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.. ఈ వాటర్ ప్రేగు కదలికలను సులభతరం చేయడమే కాకుండా అజీర్ణం నుండి ఉపశమనాన్ని అందిస్తుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
మరోవైపు దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీర ఆకులను కలిపి వేడి నీళ్లలో మరగబెట్టి ప్రతిరోజూ తాగితే శరీరంలో ఉన్న వ్యర్ధాలు (Waste Materials)అన్ని తొలగిపోతాయని ఆరోగ్యనిపుణులు తెలియచేస్తున్నారు.
బరువు (Weight lose) తగ్గాలని ఆలోచించే వారికి కూడ ఈ కషాయం (Potion) ఔషదంగా (medicine) పనిచేస్తుందని నిపుణులు తెలుపుతున్నారు.. ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీర కలిపిన గోరువెచ్చని నీటిని తాగడం వల్ల శరీరంలోని కొవ్వు కరిగిపోతుందంటున్నారు..
ఇక రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో ఈ కషాయం తీరు అద్భుతం అంటున్నారు ఆరోగ్యనిపుణులు.. దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీరతో కూడిన ఆయుర్వేద ఔషదం వేడి నీటితో తీసుకోవడం వల్ల.. రోగనిరోధక శక్తి పెరుగుతుందని అంటున్నారు నిపుణులు..
ఈ చలి కాలంలో వచ్చే ముఖ్యమైన సమస్యల్లో జలుబు, దగ్గు ఒకటి. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారికి ఈ వైరస్ త్వరగా వ్యాపిస్తుంది. అందువల్ల ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే.. దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, కొత్తిమీరతో చేసిన కషాయాన్ని ప్రతిరోజూ తాగవచ్చని ఆరోగ్యనిపుణులు (Health professionals) తెలియచేస్తున్నారు. ఇక ఏదైనా మితంగా.. తగినంత మోతాదులో తీసుకుంటే ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటాయి.. లేదంటే పలు సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు..
నోట్ : సామాజిక మాధ్యమాలలో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ విషయాలను తెలియచేయడం జరిగింది.. వీటిని ఆచరించే ముందు ఒకసారి సంబంధిత నిపుణుల సలహాల పాటించవలసిందిగా మనవి.