చెన్నై(Chennai)లోని చిదంబరం క్రికెట్ స్టేడియం(Chidambaram cricket stadium)లో సోమవారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. దీంతో పాక్ క్రికెట్ అభిమానులు పాక్ క్రీడాకారులపై విరుచుకుపడుతున్నారు. ఆప్ఘనిస్థాన్ లాంటి పసికూనపై 8 వికెట్ల తేడాతో ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. ఇలా అన్ని విభాగాల్లో పాక్ క్రీడాకారులు నిరాశ పరిచారు. ఈ క్రమంలో పాక్ మాజీ క్రీడాకారుడు వసీం అక్రం చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.
‘ఇది నిజంగా తలవంపులే, జస్ట్ రెండు వికెట్లు.. 280- 290 స్కోరు.. ముందున్నది పెద్ద టార్గెట్ ఏమీ కాదు. పిచ్ సంగతి పక్కన పెడితే ఓసారి పాక్ ఫీల్డింగ్ చూస్తే వీళ్ల ఫిట్నెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలిసిపోతుంది. క్రీడాకారుల్లో రెండేళ్లుగా ఫిట్నెస్ తగ్గిందని మ్యాచ్ సందర్భంగా మేము పలుమార్లు చర్చించుకున్నాం. ఇక్కడ క్రీడాకారుల పేర్లు ప్రస్తావిస్తే వారికి నచ్చదు కానీ వీళ్లు రోజుకు 8 కేజీల చొప్పున మటన్ తింటున్నట్లు ఉంది. వాళ్లు దేశం తరపున బరిలోకి దిగారు. ఇందుకు పారితోషికం కూడా తీసుకుంటున్నారు. అలాంటప్పుడు కాస్తైనా ప్రొఫెషనల్‌గా ఉంటే బాగుంటుంది’ అని చెప్పుకొచ్చారు.
‘ఇలాంటి విషయాల్లో మిస్బా కచ్చితంగా ఉండేవాడు. క్రీడాకారులకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించేవాడు. ఇది వారికి నచ్చేది కాదు కానీ జట్టు పరంగా అద్భుతాలు సృష్టించింది. ప్రస్తుతం ఏ స్థితికి చేరుకున్నామంటే విజయం కోసం దేవుణ్ణి ప్రార్థించాల్సి వస్తోంది. అది జరిగితే బాగుండు.. ఇది జరిగితే బాగుండు.. మరో టీం ఓటమి చెందితే సెమీస్‌కు చేరొచ్చంటూ మాట్లాడుతున్నాం. ఫీల్డింగ్ అంటే ఫిట్నెస్తో ముడిపడింది. మైదానంలో ఇది స్పష్టంగా తెలిసిపోతుంది’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
పాకిస్థాన్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో 283 పరుగుల భారీ టార్గెట్‌ను ఆఫ్ఘాన్ టీమ్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించడం విశేషం. ఆరంభంలో నెదర్లాండ్స్, శ్రీలంకపై నెగ్గిన పాక్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. ఇండియా, ఆస్ట్రేలియా అంటే పెద్ద టీమ్స్, వీళ్ల చేతుల్లో ఓటమిని ఒప్పుకోవచ్చు.. కానీ, చివరి ఆఫ్ఘనిస్థాన్ చేతుల్లో కూడా ఓటమి పాలైంది పాకిస్థాన్.