Telugu News » Rs Praveen : మేము అధికారంలోకి వచ్చిన తొలి రోజే…. ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు….!

Rs Praveen : మేము అధికారంలోకి వచ్చిన తొలి రోజే…. ఆర్ఎస్ ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు….!

తాము అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సీబీఐ (CBI)కి అప్పగిస్తామని పేర్కొన్నారు.

by Ramu
Breaking: RS Praveen Kumar arrested..!

బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్.ఎస్. ప్రవీణ్ (Rs Praveen) సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఎస్పీఎస్సీ (TSPSC) అవినీతిలో కూరుకుపోయి, రాజకీయ పునరావాస కేంద్రంగా మారిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి రోజే ప్రస్తుత టీఎస్పీఎస్సీని రద్దు చేస్తామన్నారు. తాము అధికారంలోకి వచ్చాక టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును సీబీఐ (CBI)కి అప్పగిస్తామని పేర్కొన్నారు.

we will abolish the tspsc board rs praveen kumar

సోషల్ మీడియా వేదికగా నిరుద్యోగులకు ఆర్ఎస్ ప్రవీణ్ 12 హామీలను ఇచ్చారు. టీఎస్పీఎస్సీలో లీకేజీకి పాల్పడిన చైర్మన్ తో పాటు సభ్యులు, కీలక ఉద్యోగులపై చట్ట ప్రకారం విచారణ జరిపి వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. టీఎస్పీఎస్సీని పూర్తిగా ప్రక్షాళన చేస్తామన్నారు. అత్యాధునికమైన బ్లాక్ చెయిన్ టెక్నాలజీ, ఎన్ క్రిప్షన్, డిక్రిప్షన్ టాక్నాలజీని ఉపయోగించి లీకేజీలకు తావు లేకుండా ప్రశ్నాపత్రాలను డేటా బేస్ లో పెడతామన్నారు.

ఏండ్ల తరబడి టీఎస్పీఎస్సీ బోర్డులో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు ప్రత్యేక నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగులపై ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తామన్నారు. ప్రత్యేక ‘ఇంటర్నల్ విజిలెన్స్’ ఏర్పాటు చేస్తామని తెలిపారు. టీఎస్పీఎస్సీ ఉద్యోగ నోటిఫికేషన్లలో ఎలాంటి రాజకీయ, కోర్టు వివాదాలకు తావివ్వకుండా అత్యంత కట్టుదిట్టంగా ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తామన్నారు.

గ్రూప్స్ ఉద్యోగాలకు వయోపరిమితి మరో 5 ఏండ్లు పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. దీంతో పాటు రాష్ట్రంలో ఖాళీలు ఉన్న అన్ని ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామన్నారు. టీఎస్పీఎస్సీ బోర్డులో సివిల్ సర్వీస్ ఉద్యోగులతో పాటు మేధావులు, విద్యావేత్తలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వారిని మాత్రమే చైర్మన్, బోర్డు సభ్యులుగా నియమిస్తామని స్పష్టం చేశారు.

You may also like

Leave a Comment