క్రికెటర్లకి సంబంధించిన విషయాలు తెలుసుకుంటే, ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని విషయాలు మనకి తెలియదు. టెస్ట్ మ్యాచ్ టైంలో లంచ్ మరియు టీ విరామ సమయంలో క్రికెటర్లు ఏం తింటారు అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మరి క్రికెటర్లు ఆ టైంలో ఏం తింటారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ప్లేయర్లు పోషించే పాత్రని బట్టి లంచ్ ఉంటుంది. లంచ్ బ్రేక్ సమయంలో ఇద్దరు బ్యాట్స్మన్ క్రీజ్ లో బ్యాటింగ్ చేస్తూ ఉన్నట్లయితే, వాళ్లకి బ్రేక్ లో తక్కువ పెడతారు. తక్కువ తీసుకుంటారు. వికెట్ల మధ్య పరిగెత్తే సమయంలో అలసట వచ్చి ఆడడం కూడా కుదరదు. కాబట్టి తక్కువ తీసుకుంటారు.
అలసట ఉండకూడదు కాబట్టి ప్రోటీన్ బార్, అరటి పండ్లు వంటివి తక్కువ పరిమాణంలో మాత్రమే తీసుకుంటారు. లంచ్ తిన్న తర్వాత బౌలింగ్ చేయబోయే బౌలర్లు కూడా ఇలా లిమిట్ గానే తీసుకుంటారు. కేవలం తక్కువ మంది మాత్రమే హెవీ గా ఉండే ఆహార పదార్థాలని తీసుకుంటారు. బ్యాటింగ్ టీం లో డ్రెస్సింగ్ రూమ్ లో కూర్చునే వాళ్ళు, బౌలింగ్ టీంలో కేవలం ఫీల్డింగ్ చేసేవాళ్లు ఏమైనా తినొచ్చు.
Also read:
వీళ్ళకి చాలా వెరైటీలు పెడతారు. నాన్ వెజ్ తినే వాళ్ళకి ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్, ఫిష్ వంటివి ఇస్తారు. శాఖాహారం మాత్రమే తినేవాళ్లు పప్పులు, కూరలు, సలాడ్స్ వంటివి తీసుకుంటూ ఉంటారు. లంచ్ చివర ఫ్రూట్ సలాడ్ ఇలా పెద్ద డెసర్ట్ లిస్ట్ ఉంటుంది ఐస్ క్రీమ్ ను కూడా వీళ్లు తినొచ్చు. కొవ్వు తక్కువగా ఉండేవి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేటట్టు లంచ్ లో చూసి పెడతారు. వాళ్ళ వ్యక్తిగత అలవాట్ల ప్రకారం ప్రత్యేక లంచ్ క్రికెటర్లకి ఏర్పాటు చేస్తారు.