రామన్న.. తెలంగాణలో బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీమంత్రి కల్వకుంట్ల తారకరామారావు(KTR)ను అందరను ప్రేమగా పిలుచుకునే పేరు. పొలిటికల్‌గా చాలా మంది ఆయన్ను కేటీఆర్ అని పిలిస్తే.. ఊర్లల్లో మాత్రం కేటీఆర్‌ను రామన్న అని సంభోదిస్తుంటారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ఆ పార్టీ ఎమ్మెల్యేల వల్లనే భారీగా డ్యామేజ్ ఏర్పడిందని, సిట్టింగ్ స్థానాలను మార్చితే మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేదని అటు ప్రజలు,ఇటు సొంత కేడర్‌తో పాటు ఎన్నికలు అయ్యాక కేటీఆర్ సైతం అభిప్రాయం వ్యక్తంచేశారు. అయితే,ఎమ్మెల్యేల మీద ఉన్న కోసం కేసీఆర్ ఫ్యామిలీ మీద పెద్దగా లేదని తేలింది.
ఎందుకంటే హైదరాబాద్ అభివృద్ధిలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారనడంలో అతిశయోక్తి లేదు. అందుకే యువత ఆయన్ను ‘రామన్న’(RAMANNA) పిలుచుకుంటారు. కేటీఆర్ ఐటీ రంగం విస్తరణకు, అభివృద్ధికి ఎంతో కృషి చేశారని టెకీలు చెబుతుంటారు.యూత్‌కు ఏం కావాలో కేటీఆర్‌కు బాగా తెలుసు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి విషయంపై స్పష్టమైన అవగాహనతో స్పందిస్తుంటారు. రామన్నకు సోషల్ మీడియాలో యూత్ ఫాలోయింగ్ చాలా ఉంది.ఈ క్రమంలోనే కేటీఆర్ మీద ఓ జంట తమ అభిమానాన్ని చాటుకుంది. మే 5న ముఖరా కే గ్రామానికి చెందిన ధీరజ్, వైష్ణవి విహహం జరగనుంది.
ఈ జంట ముందుగా కేటీఆర్ పేరు రాసి ప్రీవెడ్డింగ్ షూట్(Pre wedding shoot) ప్రారంభించారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ఎక్స్ అకౌంట్ లో పోస్టు చేసి నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.