సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో చోటుచేసుకున్న వింత సంఘటనలు వైరల్‌గా మారుతున్నాయి. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుండగా మరికొన్ని భయపెడుతున్నాయి. ఇంకా కొన్ని నమ్మశక్యం కాని వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటనే ఉత్తర్‌ప్రదేశ్‌లో వెలుగు చూసింది.
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో (Moradabad) విచిత్రం చోటుచేసుకున్నది. మొరాదాబాద్‌లోని బస్టాండ్ సమీపంలో ఉన్న ఓ బోరు(Hand pump) నుంచి తెలుపు రంగులో (White water) నీళ్లు రావడంతో స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. అచ్చం పాల(Milk)లాగే ఉన్న ఆ నీటిని చూసి స్థానికులు బిందెలు, నీళ్లబాటిళ్లలో తీసుకొని వెళ్లారు.
అదేంటీ బోరు నుంచి పాలు ఎలా వస్తాయనేగా మీ సందేహం.. నిజానికి అందులో నుంచి వస్తున్నది పాలు కాదు నీళ్లే. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు అక్కడికి చేరుకుని ఆ బోరింగ్‌ను పరిశీలించారు. అవి పాలు కాదని, కలుషిత నీళ్లని తెలిపారు.
చేతిపంపు అడుగు భాగంలో చెడిపోయిందని, దీంతో అది ఒకట్టినప్పుడు తెలుపు రంగులో ఉన్న కలుషితమైన నీరు బయటకు వస్తున్నదని అధికారులు తెలిపారు. దీనిపై విచారణ చేపట్టాలని బిలారి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బోరును పూర్తిగా పరిశీలించిన తర్వాతే నీటిని వినియోగించుకోవడానికి అనుమతి ఇవ్వాలని స్పష్టం చేశారు.
जैसे हर चमकती चीज सोना नहीं होती, वैसे सफ़ेद रंग केवल दूध का ही नहीं होता। मगर लोगों को कैसे समझाया जाए? मुरादाबाद की बिलारी तहसील में सरकारी हैंड पंप से सफेद पानी को लोगो ने दूध मान कर न केवल पिया बल्कि भर-भरकर साथ भी ले गए। pic.twitter.com/CSUPdezWNV
— SANJAY TRIPATHI (@sanjayjourno) November 27, 2023