సూపర్ స్టార్ రజినీకాంత్ ఎంత పెద్ద నటుడో మనకి తెలుసు. ఆయన గురించి ప్రత్యేకించి పరిచయం చేయక్కర్లేదు. రజినీకాంత్ కెరియర్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాల్లో భాషా సినిమా ఒకటి. ఈ సినిమా రజినీకాంత్ కెరీర్ మలుపు తిప్పేసింది. ఈ సినిమాలో రజనీకాంత్ స్టైల్ అందరిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. సురేష్ కృష్ణ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడు సురేష్ రజనీకాంత్ రియల్ లైఫ్ కి దగ్గరగా ఉండాలని కండక్టర్ గా చూపించాలని అనుకున్నారు కానీ రజనీకాంత్ ఆ పాత్రకి కనెక్ట్ అయ్యేలా ఉండాలని చెప్పడంతో ఆటోడ్రైవర్ పాత్రని ఫిక్స్ చేశారు.
ఈ మూవీ లో రజనీ కాంత్ విలన్ ని కొట్టే సీన్ చాలా హైలెట్ గా ఉంటుంది. విలన్ గా రఘువరన్ ని ఫిక్స్ చేశారు. ఈ సినిమా షూటింగ్ అప్పుడు చిరంజీవి నటిస్తున్న బిగ్బాస్ సినిమా స్టోరీ భాషా స్టోరీ ఒకటే అని దర్శకులకి తెలిసింది. దాంతో సురేష్ కృష్ణ చెన్నై కి వెళ్లి బిగ్ బాస్ షూటింగ్ స్పాట్లో భాష మూవీ కథని చిరంజీవికి చెప్పారు. పక్కనే అల్లు అరవింద్ ఉండడంతో ఆయన కూడా కథ విన్నారు. అల్లు అరవింద్ బిగ్ బాస్ సినిమాని ఆపేసి భాష మూవీని తెర మీదకు తీసుకు రావాలని అనుకున్నారు.
Also read:
నిర్మాతని సంప్రదించి 25 లక్షలు ఇస్తానని చెప్పారు కానీ అతను 40 లక్షలు అడగడంతో దానికి కూడా ఒప్పుకున్నారు. భాష సినిమా అని తొమ్మిది కోట్లు బడ్జెట్ తో తెరకెక్కించారు. రీమేక్ రైట్స్ అమ్మాలని నిర్మాతలు భావించారు అల్లు అరవింద్ కి బేరం కుదరలేదు. తర్వాత డబ్బింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు. డబ్బింగ్ రైట్స్ ఎనభై లక్షలు వచ్చాయి అప్పట్లో 25 లక్షలు డబ్బింగ్ రైట్స్ ఉండడమే ఎక్కువ ఇలా సినిమాని రీమేక్ చేయకుండా డబ్ చేసి వదిలేసారు