Telugu News » Angry Elephant : బైకర్లపైకి దూసుకొచ్చిన గజరాజు…తర్వాత ఏమైందంటే…!?

Angry Elephant : బైకర్లపైకి దూసుకొచ్చిన గజరాజు…తర్వాత ఏమైందంటే…!?

కేరళరాష్ట్రం(State of Kerala)లో వయనాడ్(Wayanad) అభయారణ్య(sanctuary)మార్గంలో ఓ ఏనుగు బైకర్లపై విరుచుకుపడింది.

by sai krishna

కేరళరాష్ట్రం(State of Kerala)లో వయనాడ్(Wayanad) అభయారణ్య(sanctuary)మార్గంలో ఓ ఏనుగు బైకర్లపై విరుచుకుపడింది.తొలుత అటుగా వస్తున్న ఏనుగును చూసి వాహనదారులు ఆగిపోగా..ఓఆట ఆడుకుందాం అనుకుందాం అనుకుందో ఏంటో..!

ఆగివున్న బైకర్ మీదకి ఏనుగు దూసుకువచ్చింది ఈ భయానక దృశ్యాన్ని చూసిన మరో బైకర్ అట్నుంచి అటే అడవుల్లోకి తుర్రుమన్నాడు.మంగళవారం ఉదయం 8 గంటలకు వయనాడ్ అభయారణ్యంలోని ముథంగ-బందీపుర్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.


బైకర్ల వెనక కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి ఈ ఘటనను వీడియో తీశాడు.ఏనుగును చూసి బైకర్లు రోడ్డు మధ్యలోనే ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఏనుగు ఒక్కసారిగా తమవైపు దూసుకొచ్చే సరికి వారు ఆందోళన చెందారు.

దీంతో బైక్ రోడ్డుపైనే పడిపోయింది. బైక్ను పైకి లేపుతుండగా.. ఏనుగు వారికి మరింత దగ్గరగా వచ్చింది. ఈ సమయంలోనే ఓ యువకుడు అక్కడి నుంచి పారిపోయాడు. బైక్ను పట్టుకున్న మరో వ్యక్తి.. వాహనాన్ని ప్రారంభించి రోడ్డు పక్కన అడవిలోకి పోనిచ్చాడు.


ఆ తర్వాత బైక్ను వదిలేసి పరిగెత్తడం వీడియోలో కనిపిస్తోంది. మలప్పురంలోని కొట్టక్కల్ ప్రాంతానికి చెందిన నజీర్ ఈ వీడియో రికార్డ్ చేశాడు. ఏనుగు దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డ ఇద్దరు వ్యక్తులు కర్ణాటకకు చెందినవారిగా గుర్తించారు.

You may also like

Leave a Comment