Telugu News » ఏపీలో ఎన్టీఆర్ సినిమాలు.. ఇక మీదట ఆడడం కష్టమా..? అసలేం జరిగింది..?

ఏపీలో ఎన్టీఆర్ సినిమాలు.. ఇక మీదట ఆడడం కష్టమా..? అసలేం జరిగింది..?

జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయం చెప్పక్కర్లేదు. నటనతో, డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కి అభిమానులు కూడా ఎక్కువే

by Sravya

జూనియర్ ఎన్టీఆర్ గురించి పరిచయం చెప్పక్కర్లేదు. నటనతో, డాన్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ ఉంటారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ కి అభిమానులు కూడా ఎక్కువే. అద్భుతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకు వెళ్లిపోతున్నారు. ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఎన్టీఆర్ కెరియర్ కి పెద్ద ప్లస్ అయ్యింది. అంతర్జాతీయ లెవెల్ లో ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఇదిలా ఉంటే పెద్ద ఎత్తున విమర్శలు ఎన్టీఆర్ పై వస్తున్నాయి ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత స్పందించలేదని ఎన్టీఆర్ పై అటు తెలుగుదేశం నాయకులు, ఇటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా ఫైర్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఎన్టీఆర్ అభిమానులు వర్సెస్ తెలుగుదేశం కార్యకర్తలు అన్న విధంగా మారిపోయింది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక అభిమాని స్వయంగా ఎన్టీఆర్ కి ఫోన్ చేసి, ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక అసలు ఏం జరిగిందనే విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు అరెస్ట్ ని వ్యతిరేకిస్తూ ఎన్టీఆర్ సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఏపీలో ఆయన సినిమాలని ఆడనివ్వమని, వార్నింగ్ ఇచ్చారట.

Also read:

 

అధికారంలోకి తెలుగుదేశం పార్టీ వచ్చాక ఎన్టీఆర్ సినిమాలను ఏపీలో ఆడనివ్వమని ఎన్టీఆర్ కి వార్నింగ్ ఇచ్చారట. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ విషయంపై వాళ్ళ స్టైల్ లో కౌంటర్ ఇచ్చారు. నిజంగానే మీకు దమ్ము, ధైర్యం ఉంటే ఎన్టీఆర్ సినిమా ఒక్క షో ఆపి చూడండి అని సవాల్ చేశారట. చంద్రబాబు నాయుడు అరెస్ట్ ఇవ్వడంతో సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు అభిమానులు అందరూ సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాటలు యుద్ధం చేశారు. అయితే ఇప్పటికే ఎన్నో రకాలుగా విమర్శలు ఎదురైనా ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు. చంద్రబాబు విషయంలో ఎన్టీఆర్ మౌనంగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమాతో బిజీగా ఉన్నారు. దేవర సినిమాతో ఎన్టీఆర్ హిట్టు కొడతారా లేదా అనేది చూడాలి.

You may also like

Leave a Comment