రాష్ట్రీయ జనతా దళ్ ( RJD) నేత అబ్దుల్ బారీ సిద్ధిఖీ (Abdul Bari Siddiqui) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లిప్ స్టిక్ (Lipstick) పెట్టుకుని బేబి కటింగ్ హెయిర్ స్టైల్ (Hair Style) ఉన్న మహిళలు కొందరు మహిళా రిజర్వేషన్ బిల్లు (Woman Reservation Bill) పేరు మీద ఇప్పుడు ముందుకు వస్తారంటూ వ్యాఖ్యానించారు. దీనిపై మహిళా సంఘాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి.
బిహార్ లోని ముజఫరపూర్ లో నిర్వహించిన ఓ సమావేశంలో సిద్దిఖీ మాట్లాడుతూ….. లిప్ స్టిక్ పెట్టుకునే మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం ఎంత వరకు సమంజసం అయన విమర్శలు గుప్పించారు. లిప్ స్టిక్ పెట్టుకుని, బేబీ కటింగ్ తో వున్న మహిళలు ఇప్పుడు మహిళా రిజర్వేషన్ పేరిట హంగామా చేస్తారంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వారికి బదులుగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాల్సిందన్నారు. దీంతో పాటు తన అనుచరులకు, ఆర్జేడీ కార్యకర్తలకు ఆయన ఓ సూచన చేశారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు మీరంతా టీవీ షోలు చూడటం మానేయాలన్నారు. అంతే కాకుండా బుర్రలు వాడకుండా సోషల్ మీడియాకు దూరంగా వుండాలన్నారు.
మీకు రావాల్సిన వాటా కోసం పోరాటం చేయడంటూ తన మద్దతు దారులకు సూచించారు. మన పూర్వీకులకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపారు. మన మంతా మన పిల్లలను విద్యా వంతులను చేసి మన వాటా కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.